మీరేంటీ- ఆ బిహేవియర్ ఏంటీ: పాపం.. ఆమెకు కన్నీళ్లొక్కటే తక్కువ

Donald Trump and Zelensky: మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్‌కు చెందిన కౌంటర్‌పార్ట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.

కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ అంగీకరించట్లేదనేది వైట్‌హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్‌స్కీ. డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.

The reaction of Ukraine s Ambassador to the US Oksana Markarova has gone viral

అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ- వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన అజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అంగీకరించలేదు జెలెన్‌స్కీ. కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు.

ఫలితంగా- ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ వాదులట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరఫున ట్రంప్ వాదిస్తోన్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. మధ్యవర్తిగా రెండు దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్నారనే వాదనను వినిపించారు.

ఈ వాగ్వివాదం కారణంగా ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్‌స్కీ.. వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం కనిపించింది. ఇందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెరమీదికి వచ్చింది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు.

ఈ వాగ్వివాద సమయంలో అక్కడే ఉన్న అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకోవా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఇద్దరు నేతల మధ్య మాటలు.. తూటాల్లా పేలుతున్న సమయంలో ఆమె తలదించుకున్నారు. కన్నీళ్లొక్కటే తక్కువ అన్నట్టు కనిపించారు. తలపట్టుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చర్చలు ఈ స్థాయిలో విఫలమౌతాయని ఒక్సానా మరకోవా భావించివుండకపోవచ్చు. ఈ చర్చలు గనక సఫలమైతే మూడు సంవత్సరాల నాటి యుద్ధానికి తెరపడుతుందని ఆశించి ఉండొచ్చు. దీనికి భిన్నంగా ఘర్షణ పూరక వాతావరణం ఏర్పడటం ఆమెను ఆవేదనకు గురి చేసినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+