అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ జీతం ఎంత - భద్రత, ప్రత్యేక సౌకర్యాలు ..!!

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వేళ ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలు అభినందనలు తెలియ చేస్తూ సందేశాలు ఇస్తున్నారు. అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ అందుకునే జీత భత్యాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడికి అందే ప్రత్యేక సౌకర్యాలు ఏంటి. ఎలాంటి భద్రత నడుమ అమెరికా అధ్యక్షుడు విధులు నిర్వహిస్తారనేది కీలక అంశం.

అమెరికా అధ్యక్షుడికి ఏటా 4లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం లభిస్తుంది. అంటే ప్రతినెలా రూ.30 లక్షల వేతనం చేతికి అందుతుంది. 2001 సంవత్సరం నుంచి మార్పులు.. పెంపు లేకుండా ఇదే మొత్తాన్ని అధ్యక్షుడికి చెల్లిస్తున్నారు. సింగపూర్, కెన్యా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా అధ్యక్షుల కంటే అమెరికా అధ్యక్షుడి జీతం తక్కవ. కాగా, అమెరికా అధ్యక్షుడికి అందే అదనపు భత్యాలు...సౌకర్యాలు మాత్రం ఇతర దేశాధినేతల కంటే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. భద్రతా పరంగా అధునాతన సౌకర్యాలతో కూడిన నిఘా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో కనిపిస్తుంది.

The US president earns a substantial annual salary of 400 000 a figure set by Congress in 2001

అమెరికా అధ్యక్షుడి జీతంతో పాటుగా అదనంగా భత్యాలు పెద్ద మొత్తంలో చెల్లిస్తారు. కార్యాలయ నిర్వహణ.. వ్యక్తిగత సిబ్బంది.. ఇతర అవసరాల కోసం రూ.43 లక్షలను కేటాయిస్తారు. అదే విధంగా అధ్యక్షుడి ట్రావెల్ అలవెన్స్ కోసం పన్ను మినహాయింపు సౌలభ్యంతో రూ.86 లక్షలు చెల్లిస్తున్నారు. ఇక.. అధ్యక్షుడికి వినోద భత్యం కూడా చెల్లింపు ఉంటుంది. దీని కోసం రూ 16 లక్షలు.. అధికారిక నివాసం వైట్ హౌస్ అలంకరణ.. నిర్వహణ ఖర్చుల కోసం ఏటా రూ.86 లక్షలను చెల్లిస్తారు. ఈ మొత్తంగా జీతం - అలవెన్సులు కలిపితే అధ్యక్షుడికి ఏటా రూ 4.92 కోట్ల మేర అందుతుంది.

అదే విధంగా ప్రెసిడెంట్ కు వసతితో పాటుగా ఎయిర్​ఫోర్స్ వన్ విమాన సర్వీసు, మెరైన్ వన్ సర్వీ సు, సాయుధ లగ్జరీ కారు అందుబాటులో ఉంటుంది. ఇక భద్రత వ్యవహారాలు మొత్తం
అమెరికా సీక్రెట్ సర్వీసు పర్యవేక్షిస్తుంది. అధ్యక్షుడి ఆరోగ్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అదే విధంగా అధ్యక్షుడిగా పని చేసిన మాజీలకు ఏటా రూ 1.99 కోట్ల మేర పెన్షన్ ఇస్తున్నారు. కార్యాలయం, నివాసం, వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+