కొడ్తుంటే భర్త ఆపలేదు: స్త్రీల కోసం ఓ గ్రామం ఏర్పాటు
కెన్యా: కెన్యాలోని ఓ గ్రామంలోకి మగవారికి అనుమతి లేదు. కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25 ఏళ్ల క్రితం మహిళల కోసమే ఉమోజా అనే గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఉమోజా గ్రామ ప్రస్తుత అధ్యక్షురాలు ఆమె. రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో తమ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారని, వారి ఆకృత్యాలకు హద్దు ఉండేది కాదని ఆమె చెబుతుంటుందంట. గ్రామంలో మహిళలను విపరీతంగా కొట్టేవారట.

ఓ రోజు పలువురు ఆమెను విపరీతంగా కొడుతుంటే భర్త కూడా అడ్డుకోలేదట. దీంతో, ఇక పురుషులకు దూరంగా కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలని భావించిన ఆమె... 1990లో ఉమోజా గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి చాలామంది మహిళలు ఆమెతో చేరిపోయారు. ఇక్కడకు పురుషులకు నో ఎంట్రీ.












Click it and Unblock the Notifications