ఒంటెకు ముద్దు పెట్టిన కోడలు: కాపురంలో నిప్పులు

సౌదీ: సౌదీ అరేబియాలో ఓ వింత సంఘటన జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ ఒంటెకు కోడలు ముద్దు పెట్టడం, అదే సమయంలో అత్త చూడటంతో పచ్చగా ఉన్న ఓ కాపురంలో మంటలు చెలరేగాయి.

సౌదీ అరేబియాలోని మనామా ప్రాంతంలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరితో పాటు భర్త తల్లి అక్కడే ఉంటున్నారు. వీరు ఓ ఒంటెను పెంచుకుంటున్నారు. గత నెలలో కోడలు ఒంటెను ముద్దు పెట్టుకుంది.

అంతే అత్తకు చిర్రెత్తింది. ఆచారాలను మంటకలుపుతున్నావని, మతాన్నికించపరిచావని మండిపడింది. వెంటనే కోడలికి విడాకులు ఇవ్వాలని కొడుకు మీద ఒత్తిడి తెచ్చింది. పెద్దలు పంచాయితీ చేసినా ఫలితం లేకపోయింది.

The wife insisted that the kiss was innocent and spontaneous.

అయితే తాను తప్పుగా ఒంటెను ముద్దు పెట్టుకోలేదని, తన అత్త కోపానికి వేరే కారణం ఉందని కోడలు ఆరోపించింది. తనకు పిల్లలు పుట్టకపోవడం వల్లనే విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుందని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

చివరికి భార్య మీద ఉన్న ప్రేమతో భర్త ఆమె ఇంటికి వెళ్లి నచ్చ చెప్పి కాపురానికి తీసుకు వచ్చాడు. ఇప్పుడు అదే ఇంటిలో కొన్ని గదులలో దంపతులు, కొన్ని గదులలో అత్త వేరువేరుగా నివాసం ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+