• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్కడ 'ఐఫోన్' చాలా చీప్ గురూ...!

By Ramesh Babu
|

అంగోలా: 'చేతిలో ఐఫోన్ ఉంటే.. ఆ కిక్కే వేరప్పా..' అని ఆశ పడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఐఫోన్ ధర చూస్తే గుండె 'లబ్ డబ్' అని కాకుండా 'లబోదిబో' అని కొట్టేసుకుంటుంది. అయితే మీరు ఆఫ్రికన్ దేశమైన అంగోలాలో ఉంటే మాత్రం వీజీగా ఓ ఐఫోన్ ఓనర్ అయిపోవచ్చు.

ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఐఫోన్లు దొరికేది అక్కడే. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ లినియో జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

మొత్తం 14 రకాల గ్యాడ్జెట్ల ధరలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను తాజాగా 'టెక్నాలజీ ప్రైస్ ఇండెక్స్' పేరుతో విడుదల చేసింది. మొత్తం 72 దేశాలలో ఒక్కో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ సంస్థలు పెట్టిన ధరలను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

There.. iPhone is Very cheep!

తక్కువ ధర మోడల్ నుంచి.. అత్యంత ఖరీదైన మోడల్ వరకు కలిపి సగటు ధరలను అందులో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అంగోలాలో ఐఫోన్ సగటు ధర 401.4 డాలర్లు అంటే.. మన డబ్బులో రూ.27,290 మాత్రమే. అదే ఐఫోన్ ధర భారత్ లో 505.25 డాలర్లు కాగా అమెరికాలో దీని ధర 625.88 డాలర్లు అంటే.. రూ.43,230.

ఇక ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నవెనెజులా దేశంలో అయితే ఐఫోన్ కొనే విషయంలో కోటీశ్వరులు సైతం వెనకడుగు వేసేలా ఉన్నాయట ధరలు. ఆక్కడ దీని సగటు ధర 97,813.82 డాలర్లు ( రూ.66 లక్షలు పైనే) ఉన్నట్లు లినియో నివేదిక వెల్లడించింది.

ద్రవ్యోల్బణంలో తగ్గుదల, స్థానిక పన్నుల స్థాయిని బట్టి ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. అంగోలాలో పన్నులు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ మొబైల్ ఫోన్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఇక వెనెజులాలో ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, దిగుమతులపై కఠిన నిబంధనలు అమలులో ఉండటం వాళ్ళ అక్కడ ధరలు భారీగా ఉన్నాయట.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The iPhone is many things, but it’s certainly not cheap. If you live in Angola though, chances are you’ll get one cheaper than anywhere else in the world.This is according to the Technology Price Index, a comparative report of prices of tech products globally, compiled by Linio, the Rocket Internet-owned online retailer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more