వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాత్యహంకారం: మందే లేదు: జార్జ్ ఫ్లాయిడ్, బ్రియన్నా టేలర్: తల్లి పేరు ప్రస్తావనతో:

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రాట్ల తరఫున డెమోక్రాట్ల తరఫున పోటీ చేస్తోన్న భారతి సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. డెమొక్రాట్లతో నిర్వహిస్తోన్న కన్వెన్షన్లు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా జనంలోకి చొచ్చుకెళ్తున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలను కురిపిస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు. అమెరికా మొత్తాన్నీ అట్టుడికించిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదరగొట్టిన కమలా హ్యారిస్: 83 రోజులే టైమ్: అమెరికా తలరాత: నాయకత్వ శూన్యతఅదరగొట్టిన కమలా హ్యారిస్: 83 రోజులే టైమ్: అమెరికా తలరాత: నాయకత్వ శూన్యత

సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదని, ఉండకూడదని కమలా హ్యారిస్ అన్నారు. తోటి వ్యక్తులను ప్రేమించడం, ఇతరుల భావాల్ని అర్థం చేసుకోవడం, వారిని గౌరవించడం వంటి చర్యలు మటుమాయం అవుతున్నాయని చెప్పారు. నల్లజాతీయుడైన ఆఫ్రికన్-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి చెందిన సందర్భాన్ని కమలా హ్యారిస్ ప్రస్తావించారు. నల్లజాతి, ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించడానికి భయపడాల్సిన పరిస్థితులు అమెరికాలో నెలకొన్ని ఉన్నాయని అన్నారు. డెమొక్రాట్ల అభ్యర్థిత్వాన్ని ఆమె లాంఛనంగా అంగీకరించారు. అనంతరం కన్వెన్షన్‌ను ఉద్దేశించిన వీడియో ద్వారా ప్రసంగించారు.

There is no vaccine for racism, We have got to do the work: Kamala Harris

జార్జ్ ఫ్లాయిడ్, బ్రియన్నా టేలర్ వంటి వారు మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేశారని అన్నారు. వారి లక్ష్యాలను అందుకోవాల్సిన బాధ్యత నల్లజాతీయులపై ఉందని చెప్పారు. సమాన న్యాయం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని కమలా హ్యారిస్ అన్నారు. మేరీ చర్చ్ టెర్రెల్, మేరీ మెక్‌లియాడ్ బెథునె, ఫ్యానీ లౌ హ్యామెర్, డియానా నాష్ వంటి పేర్లను కమలా హ్యారిస్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. జాత్యహంకారాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నాలను చేపట్టాల్సి ఉందని అన్నారు.

తోటి వారిని ప్రేమించాలనే మనస్తత్వాన్ని తన తల్లి శ్యామలా గోపాలన్ నుంచి నేర్చుకున్నానని కమలా హ్యారిస్ తెలిపారు. సమాజంలో భేదభావం ఉండకూడదని తల్లి తరచూ చెబుతూ ఉండేవారని అన్నారు. తోటి పౌరులను సమంగా చూడాలనేది తల్లిదండ్రుల నుంచి అలవర్చుకున్నానని అన్నారు. అమెరికాలో ప్రస్తుతం దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, దీన్ని అధిగమించాల్సి ఉందని చెప్పారు. తన తల్లి పేరును ప్రస్తావించిన సందర్భంగా కమలా హ్యారిస్ భావోద్వేగానికి గురయ్యారు. బరాక్ ఒబామా, క్లింటన్ వంటి నేతలు సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని అన్నారు.

English summary
There is no vaccine for racism - said Kamla Harris, the first African-American woman and South Asian woman to be nominated on a major party's ticket, as she invoked the names of African-Americans who died for the US. "There is no vaccine for racism. We have got to do the work
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X