వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేటింగ్ కోసం కంపెనీ లీవ్, అమ్మాయిలకు ఆఫర్ అదిరిపోయింది: ఎక్కడ, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చాలా కంపెనీల్లో ఉద్యోగులకు సెలవులు దొరకాలంటే కాస్త ఇబ్బందికరమే. ఓ సెలవు కావాలంటే సవాలక్ష కారణాలు లేదా అబద్దాలు చెప్పాల్సిన పరిస్థితి. అయితే చైనాలోని రెండు కంపెనీలు యువతులకు అద్భుతమైన సెలవుల ఆఫర్ ఇచ్చాయి. ఆఫర్ అంటే ఇదీ అనేలా ఉంది. ఇలాంటి ఆఫర్లు మాకూ ఉంటే బాగుండు అని యువత అనుకునేలా ఉంది.

<strong>18 ఏళ్ల విద్యార్థితో పెళ్లయిన మహిళా టీచర్ సెక్స్, అలా అడిగింది కూడా: అరెస్ట్</strong>18 ఏళ్ల విద్యార్థితో పెళ్లయిన మహిళా టీచర్ సెక్స్, అలా అడిగింది కూడా: అరెస్ట్

మంచి ఆఫర్, కానీ షరతుల వర్తిస్తాయి

మంచి ఆఫర్, కానీ షరతుల వర్తిస్తాయి

చైనాకు చెందిన సదరు రెండు కంపెనీలు తమ ఉద్యోగినులకు ఆఫర్ రూపంలో సెలవులు ఇస్తున్నాయి. ఇదీ ముప్పై ఏళ్లు పైబడి పెళ్లి కాని ఉద్యోగినులకు మాత్రమే. డేటింగ్ (సహజీవనం) కోసం ఈ సెలవుల ఆఫర్ ఇస్తున్నాయి. ముప్పయ్యేళ్లకు పైబడి పెళ్లి కాని యువతులకు ఎవరైనా నచ్చితే వాళ్లతో డేటింగ్ కోసం లేదా ప్రేమ కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ లీవ్స్‌తో పాటు ఎనిమిది రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాయి.

 డేటింగ్ కోసం లీవ్స్ పెంచుకునే వెసులుబాటు

డేటింగ్ కోసం లీవ్స్ పెంచుకునే వెసులుబాటు

తూర్పు చైనాలో ఉన్న ఆ రెండు ప్రముఖ సంస్థలు ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. ఈ కంపెనీలు హాంగ్‍‌ఝో టూరిస్ట్ పార్కులో గల రెండు కంపెనీలు దీనిని ప్రకటించాయి. సాధారణ సెలవులు ఏడు రోజులకు అదనంగా మరో 8 రోజులు డేటింగ్ లీవ్స్ ఇస్తున్నాయి. ఒకవేళ డేటింగ్ కోసం మరికొన్ని రోజులు కావాలంటే లీవ్స్‌ను పెంచుకునే వెసులుబాటును కల్పించడం గమనార్హం.

 కారణం చెప్పిన కంపెనీలు

కారణం చెప్పిన కంపెనీలు

డేటింగ్ లీవ్స్ ఇవ్వడంపై ఆ కంపెనీలు కారణాలు చెప్పాయి. చైనాలో ఎక్కువ మంది యువతులు తాము జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో కెరీర్ ధ్యాసలో పడి పెళ్లిని మరిచిపోతున్నారు. కెరీర్ ధ్యాసలో ముప్పై, నలభై ఏళ్లకు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయట.

 గతంలోను ఇలాంటిది

గతంలోను ఇలాంటిది

గతంలో చైనాలోని ఓ స్కూల్లో సింగిల్‌గా ఉన్న, పిల్లల్లేని ఉపాధ్యాయులకు లవ్ లీవ్‌ను ఆఫర్ చేశారు. అది కూడా అప్పట్లో పెద్ద వార్త అయింది. చైనాలో మూడు పదుల వయస్సుకు దగ్గరపడిన పెళ్లికానీ మహిళలను షెంగ్‌ను.. అంటే మిగిలిపోయిన మహిళలు అని ఎద్దేవా చేస్తుంటారట.

English summary
Two Chinese companies, in a move of compassion, have decided to give dating leaves to their women employees aged over 30 to help them avoid the stigma of being tagged as leftover women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X