సల్లూభాయ్ పాటకు న్యూజిలాండ్ పోలీసుల స్టెప్పులు.. (వీడియో)
న్యూజిలాండ్ : బాలీవుడ్ కండలవీరుడు సల్లూ భాయ్ పాటకు ఫుల్ జోష్ లో స్టెప్పులేశారు న్యూజిలాండ్ పోలీసులు. సల్మాన్ ను అనుకరించే ప్రయత్నం చేస్తూ.. వేదికపై పోలీసులు వేసిన స్టెప్స్ కు అక్కడి ఇండియన్స్ అంతా ఈలలు.. కేకలతో.. ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. కాగా, దీపావళి సందర్బంగా.. అక్కడి ఇండియన్స్ నిర్వహించిన వేడుకల్లో.. ఇలా తమ స్టెప్పులతో ఆహుతులను ఆకట్టుకున్నారు పోలీసులు. న్యూజిలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ లో జరిగిన ఈ వేడుకల్లో.. అటు ఏర్పాట్లతో పాటు ఇటు పోలీసుల స్టెప్పులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వీడియో చూస్తోంటే.. సల్మాన్ ను అనుకరించడానికి పోలీసులు బాగానే కసరత్తులు చేసినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ఎప్పుడూ డ్యూటీ టెన్షన్స్‌తో ఉండే పోలీసులు ఇలా సరదాగా స్టెప్పులేసి రిలాక్స్ అయ్యారన్నమాట.












Click it and Unblock the Notifications