30 వేల కండోమ్స్, సెక్స్ టాయ్స్ దొంగిలించారు, ఎక్కడ, ఎందుకు?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30వేల కండోమ్స్ , సెక్స్ టాయ్స్ దొంగతనానికి గురయ్యాయి. వీటి తయారుచేసే కంపెనీ గోడౌన్ నుండి కొందరు వ్యక్తులు వీటిని దొంగిలించారు.

లాస్ వెగాస్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30వేల కండోమ్స్ , సెక్స్ టాయ్స్ దొంగతనానికి గురయ్యాయి. వీటి తయారుచేసే కంపెనీ గోడౌన్ నుండి కొందరు వ్యక్తులు వీటిని దొంగిలించారు. గోడౌన్ తలుపు తెరిచి కారును లోపలికి తీసుకెళ్ళి మరీ వీటిని ఎత్తుకెళ్ళారు.

లెలో అనే స్వీడన్ కు చెందిన కంపెనీకి లాస్ వెగాస్ లో ఓ గోడౌన్ ఉంది.ఇక్కడి నుండి అనేక ప్రాంతాలకు తమ వస్తువులను ఆ సంస్థ సరఫరాచేస్తుంటుంది. కండోమ్స్, సెక్స్ టాయ్స్ ను లాంటి ఉత్పత్తులను ఆ కంపెనీ తయారుచేస్తోంది.

అయితే ఈ గోడౌన్ లో వాటిని నిలువచేస్తారు. ఇక్కడి నుండే అవసరమైనచోటీకి తరలిస్తుంటారు. అయితే సెలవుల సందర్భంగా వారం రోజుల పాటు గోడౌన్ తెరవలేదు. అయితే దీనిని అవకాశంగా తీసుకొన్న దొంగలు కారును తీసుకెళ్ళి ఏకంగా గోడౌన్ లోని కండోమ్స్, సెక్స్ టాయ్స్ ను దొంగిలించారు.

Thieves steal 30,000 condoms from Vegas warehouse

సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా కారును తీసుకొచ్చారని సిసిటీవి పుటేజ్ లో చూసి ఆశ్చర్యపోయారు కంపెనీ ప్రతినిధులు. తమ గోడౌన్ లో దొంగతనం జరిగిందంటూ వీడియో పుటేజీని కూడ ఆ సంస్థ పోస్ట్ చేసింది.

అన్ని కండోమ్స్ ను వాళ్ళు ఏం చేసుకొంటారో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. అది తెలిస్తే గనుకు వారికి స్పాన్సరర్స్ గా ఉండేవాళ్ళం అంటూ ఆ కంపెనీ చమత్కరించింది.ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+