14 ఏళ్లకే 200 కోట్ల ఐడియా : అమెరికన్ చిన్నారికి కోట్లు కురిపిస్తోంది

న్యూయార్క్ : జీవితానుభవాల్లోంచే కొత్త ఆవిష్కరణలు పుట్టుకు వస్తాయనే దానికి దీన్ని విుంచిన ఉదాహరణ లేదు. అయితే మార్కెట్ శక్తులకు లొంగకుండా.. సొంతంగా ఆ ఐడియాను ఆచరణలో పెట్టి విజయం సాధించడం అంత సులువుగా సాధ్యమయ్యే విషయమేమి కాదు. కానీ, 14 ఏళ్ల ఓ అమెరికన్ విద్యార్థి దీన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం కోట్లు కుమ్మరిస్తామని ముందుకు వచ్చినా..! తన ఐడియా ద్వారా తానే ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్షతో ముందుకు కదులుతున్నాడు ఈ చిన్నారి బిజినెస్ మ్యాన్.

బేస్ బాల్ క్రీడను అమితంగా ఇష్టపడే అమెరికాకు చెందిన రోజెంతల్.. ఆటలో తరచూ గాయాల పాలయ్యే స్నేహితులకు తక్షణం చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రథమ చికిత్స కిట్లను వెండింగ్ మిషన్ ద్వారా అందుబాటలోకి తీసుకురావాలనే ఆలోచన చేశాడు. గాయాలైన ప్రతీసారి ఇంటికెళ్లి తల్లిదండ్రులతో ప్రథమ చికిత్స తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో.. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన రోజెంతల్, వెండింగ్ మిషన్ల ద్వారా చికిత్సకు అవసరమయ్యే ప్లాస్టర్లు, రబ్బరు గ్లౌజులను అందుబాటులోకి తీసుకొచ్చాడు.

This 14-Year-Old American Schoolboy Rejected A Whopping $30 Million Offer For His Business Idea

అయితే రోజెంతల్ కి వచ్చిన ఈ ఐడియా తన స్నేహితులకు, బేస్ బాల్ గ్రౌండ్ కే పరిమితం కాలేదు. నిత్యం జీవితంలోను చాలామందికి ప్రథమ చికిత్స కిట్స్ తో అవసరముంటుంది కాబట్టి, కమర్షియల్ గాను ఐడియా వర్క్ అవుట్ అయింది. ఇంకేముంది.. ఏకంగా 70 లక్షల పెట్టుబడితో తానే సొంతంగా ఓ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకుని బిజినెస్ ను మరింత విస్తరించే పనిలో పడ్డాడు.

అయితే రోజెంతల్ ఐడియాపై కన్నేసిన నేషనల్ హెల్త్ కేర్ కంపెనీ 200 కోట్లకు తన ఐడియాను కంపెనీకి అమ్మవలసిందిగా బేరసారాలకు దిగింది. అయితే కంపెనీ ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన రోజెంతల్ తానే సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+