ట్రెండ్ సెట్ చేస్తోన్న ఐదో తరగతి అమ్మాయి లెటర్!
అమెరికా : సినిమాల ప్రభావమో.. మరేమో గానీ ఇప్పటి యూత్ అంతా యమా ఫాస్ట్. యూత్ మాత్రమే కాదు.. టీనేజీ కుర్రాళ్లు.. ఆఖరికి ప్రైమరీ స్టూడెంట్స్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. ఆడపిల్లల వెంటపడడం.. 'నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి' అన్న తరహాలో వ్యవహరించడం.. ఈరోజుల్లో కామన్ అయిపోయింది. ఇండియాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. అమెరికా లాంటి ఫాస్ట్ కల్చర్ ఉన్న మోడరన్ దేశాల్లో పరిస్థితి ఎలా ఉండాలి?
ఇదిగో ఈ లేఖను చూస్తే అర్థమవుతుంది అమెరికాలో ప్రైమరీ స్టూడెంట్స్ కూడా ఎంత ఫాస్ట్ గా ఉంటారో..! అయితే ఎక్కడైనా బాధితులు ఆడపిల్లలే అన్నట్లు.. తన క్లాస్ మేట్ అయిన ఓ విద్యార్థి తన వెంటపడడం ఏమాత్రం ఇష్టపడని ఓ ఐదో తరగతి అమ్మాయి.. ఆ అబ్బాయిని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాసింది. (రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ (నియమాలు నిబంధనలు) పేరిట జోయ్ రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లేఖలో జోయ్ పేర్కొన్న రూల్స్..
1) నా భుజాలను తాకకూడదు
2) పిచ్చిపట్టిన వాడిలా ఎప్పుడూ నా వెంటే పడతుంటావు.. ఇకనుంచి నావెంట పడవద్దు
3) ఏదైనా విష్ చేసే విషయమైతే తప్పా.. నాతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు
4) బస్సులో నాతో ఆటలాడడం ఇకనుంచి ఆపేయ్
5) నాకసలే షార్ట్ టెంపర్.. నీ విపరీత ప్రవర్తనతో నా 'డే' నాశనం చేస్తున్నావు.
6) ఈ లేఖను 500 సార్లు చదువు
7)నీకు నేనంటే ఇష్టమని తెలుసు.. కానీ నేను చాలా చిన్నదాన్ని, నిన్ను బాయ్ ఫ్రెండ్ గా నేను ఇష్టపడడం లేదు.
8)ఈ లేఖలో పేర్కొన్న రూల్స్ ను గనుక నువ్వు బ్రేక్ చేస్తే.. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తా గుర్తుంచుకో!
పదేళ్ల అమ్మాయి ఇంత నిక్కచ్చిగా తన భావాలను వ్యక్తపరచడం చూసి ముచ్చటపడ్డ జోయ్ క్లాస్ టీచర్.. జోయ్ నుంచి ఆ లేఖను తీసుకుని తన ఫ్రెండ్ కు ఇచ్చింది. ఫ్రెండ్ కాస్త లెటర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో.. జోయ్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లేఖను పోస్ట్ చేసిన నాలుగు రోజుల్లోనే 10వేల లైక్స్ రావడంతో పాటు.. 7వేల సార్లు రీట్వీట్ అయింది.
My friend who's a 5th grade teacher just sent this to me! I'm dead!!! pic.twitter.com/FSDBxs9Vtq
— Denny Dimples (@WhosDenverJones) September 15, 2016












Click it and Unblock the Notifications