వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఇంటర్నెట్ స్టార్: ఈ బుజ్జాయిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది..అంతే!

|
Google Oneindia TeluguNews

మనిషికి జుట్టు చాలా అందం ఇస్తుంది. కొందరు ఆ జుట్టు లేకే ఎంతో మదనపడుతూ ఉంటారు. రకరకాల ట్రీట్‌మెంట్లు తీసుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగిపోయాకా... పోయిన జుట్టును తిరిగి తెచ్చుకునేందుకు కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే తలపై వెంట్రుకలు మనిషికి ఎంతో అందాన్నిస్తాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నాం...

జపాన్‌కు చెందిన చాంకో అనే ఓ ఏడునెలల బుజ్జాయి ఫోటో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ బుజ్జాయి ముద్దుగా బొద్దుగా ఉన్నందుకు కాదు...లేదా తన కళ్లు పెద్దగా ఉన్నందుకు కాదు....కేవలం ఆ ఏడునెలల వయస్సుకు ఆ బుజ్జాయికున్న వెంట్రుకలు చూసి ఎవరైనా నోరు వెల్లబెట్టాల్సిందే...ఇంకా ఆ పాపాయి బుడిబుడి అడుగులు కూడా వేయలేదు... ముద్దులొలికించే మాటలు కూడా చెప్పలేదు... అప్పుడే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది.

This 7month old Japan baby has all the reasons for going viral on social media

బేబీ చాంకో సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోవడానికి కారణం వెంట్రుకలు కొంత కారణమైతే... మరో వైపు ఆ బేబీ పెట్టే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా నెటిజెన్లను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బుజ్జాయికి సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా... అక్షరాల లక్షమంది. అవునండీ... ఇది నిజం.. మే నెలలో బేబీ చాంకో పేరుతో ఓ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌కు లక్షమంది ఫాలోవర్లు ఉన్నారు.

English summary
A 7-month-old Japanese girl chanko has captured the hearts of internet users, but not because of her chubby cheeks or big round eyes, it's all thanks to her impressively lustrous and thick hair.She also might be the youngest person on social media with more than 1 lakh followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X