ఫిజిక్స్ ఫార్ములాతో అత్యద్భుతం.. : రూ.500 కే ఏ.సీ

ఢాకా : ఒక్క చిన్న ఫిజిక్స్ ఫార్ములా 25వేల కుటుంబాల్లో చల్లదనాన్ని నింపింది. జీవితంలో వెలుగు నిండడమనే మాట కామనే.. కానీ చల్లదనం నిండడమేంటి అనుకుంటున్నారా..! ఎండాకాలం.. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. ఇరుకైన రేకుల ఇంట్లో.. కాలం వెళ్లదీయడానికి పేదజనం పడే బాధలు అంతా ఇంతా కాదు.

భరించలేని ఉక్కపోతతో సతమతం అవుతూ.. ప్రెషర్ కుక్కర్ లో వేసి మూత పెట్టిన చందంగా, ఎండ సెగకు, వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరయ్యే పేదవర్గాల కోసం ఓ చిన్న ఐడియాను ఆసరాగా చేసుకుని కేవలం రూ.500 లకే 'గ్రే గ్రూప్' అనే ఒక సంస్థ పేదింటి ఏ.సి లను రూపొందించింది. అయితే దీని అసలు సృష్టికర్త మాత్రం ఆశిష్ పాల్ అనే వ్యక్తి. తన కూతురు ఫిజిక్స్ పాఠాల్లో నుంచి వచ్చిన ఐడియాతో దీని నిర్మాణానికి పూనుకున్నాడు.

పనిచేసిన ఫార్ములా.. :

సాధారణంగా అరచేతులను నోటి ఎదురుగా పెట్టుకుని గాలి ఊదితే.. అరచేతులను తాకిన గాలి వేడిగా అనిపిస్తుంది. అలా కాకుండా పెదాలను ఒక్క దగ్గరికి చేర్చి చిన్నగా గాలి ఊదినట్టయితే వేడి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ గాలి ఉష్టోగ్రతల్లో మార్పులు రావడానికి ప్రధాన కారణం పీడనం (pressure).ఇదో ఫిజిక్స్ ఫార్ములా. గాలి వెడల్పాటి మార్గం నుంచి సన్నటి మార్గంలోకి తన దిశను మళ్లించుకున్నప్పుడు ఆ గాలి ఉష్ణోగ్రత పీడనం కారణంగా తగ్గించబడుతుంది. దీంతో గాలి ఉష్టోగ్రత స్వల్పంగా తగ్గుతుంది.

సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన గ్రే గ్రూప్, గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ అనే రెండు సంస్థలు కలిసి పేదింటి ఏ.సి గా పిలవబడుతున్న అతి చౌక ఏ.సి ని సంయుక్తంగా రూపొందించాయి. ఈ రెండు సంస్థల ప్రయోగాత్మక ప్రయత్నం సఫలం కావడంతో ఇప్పుడో బంగ్లాదేశ్ లోని కొన్ని వేల కుటుంబాల్లో ఈ అతిచౌక ఏ.సిని వినియోగిస్తూ మండే ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు.

This amazing Bangladeshi air cooler is made from plastic bottles and uses no electricity

ఇంతకీ ఆ సంస్థ రూపొందించిన అతిచౌక ఏ.సీ పనితీరును, దాని నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ముందుగా ఫ్లాట్ గా ఉండే ఓ బోర్డు లాంటి వస్తువుని దేన్నయినా తీసుకుని, వాటర్ బాటిల్ మూతల సైజులో బోర్డు అంతటా సరి సమానంగా కొన్ని రంధ్రాలు చేయాలి. ఆ తర్వాత తాగి పారేసిన వాటర్ బాటిల్స్ ను సేకరించి, వాటిని సగానికి కట్ చేసి, మూతవైపు ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకొని, మూతలు తొలగించి ఆ రంధ్రాల్లో బిగించేయాలి.

బాటిల్స్ ని ఆ రంధ్రాల్లో బిగించేసిన తర్వాత ఇవతలి వైపు నుంచి బాటిల్ ముందు భాగాన్ని మూతలతో మూసేస్తే, ఇక బాటిల్ బోర్డు నుంచి కింద పడకుండా బోర్డుకు గట్టిగా బిగించుకుపోతుంది. అంతే.. ఇక్కడితో అతిచౌక ఏ.సీ రెడీ. దీన్ని తీసుకెళ్లి ఇంట్లోకి గాలి వచ్చే దిశలో బిగిస్తే.. ఇంట్లోకి వచ్చే గాలి ఉష్ణోగ్రత తగ్గి ఇంట్లో చల్లదనం ఏర్పడుతుంది.

పూర్తి ఎకో ఫ్రెండ్లి.. :

ఇది పనిచేయడానికి విద్యుత్ కూడా అవసరం లేదు కాబట్టి పూర్తి ఎకో ఫ్రెండ్లిగా ఈ కూలర్ పనిచేస్తుంది. ఈ ఎకో కూలర్ ద్వారా ఇంట్లో 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి కాస్త చల్లదనం ఏర్పడే అవకాశం ఉంటుంది. కరెంట్ సౌకర్యమే లేని బంగ్లా ప్రజల జీవితాల్లో చల్లదనాన్ని నింపుతున్న ఈ ఎకో కూలర్ అక్కడి సామాన్యుల పాలిట వరంలా మారింది. సొంతంగా ఇంట్లోనే కూర్చోని తయారు చేసుకునే వీలుండడంతో, ఇప్పుడు బంగ్లాలో ప్రతి పేదవాడి ఇల్లు ఎకో కూలర్ తో దర్శనమిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+