వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే, అందమైన వధువు: సముద్రంలో దూకి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో ఓ పెళ్లి కూతురు.. మరో వ్యక్తి ప్రాణాలు రక్షించేందుకు వేగంగా ముందుకు వచ్చింది. చైనాకు చెందిన గూయాన్ యాన్... ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి ప్రాణం పోసింది. దీంతో ఆమె ఇప్పుడు 'అత్యంత అందమైన పెళ్లి కూతురు'గా సోషల్ మీడియా ప్రశంసలు అందుకుంటోంది.

ఈమె ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. పెళ్లికి ముందు ఆమె ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించేందుకు ముందుకు కదిలింది. యాన్ పెళ్లి కూతురు దుస్తుల్లో ఉంది. సముద్రతీరంలో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఉన్నట్లుండి ఆమెకు సముద్రతీరంలో మునిగిపోతున్న వ్యక్తి కనిపించాడు.

 This Chinese Bride is 'Most Beautiful' and Not Because of How She Looks

స్విమ్మింగ్ చేస్తున్న అతనికి గుండెపోటు రావడంతో అతను అచేతనంగా మారాడు. అంతే, ఆ పెళ్లి కూతురు ఒక్క క్షణం ఆలోచించకుండా.. అక్కడకు చేరుకొని అతనిని ఒడ్డుకు చేర్చింది. అతని గుండె స్పందన ఆగిపోవడంతో.. గుండెకు కృత్రిమంగా స్పందనలు అందించే ప్రక్రియను ప్రారంభించింది.

దీంతో, అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చైనాలోని డాలియన్ సెంట్రల్ ఆసుపత్రిలో ఆమె నర్సుగా పని చేస్తోంది. దీనిని స్థానిక మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో, గూయాన్ యాన్ పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యంత అందమైన కూతురు అంటూ కొనియాడారు. ఆమెను పెళ్లి చేసుకోబోయే యువకుడు కూడా ఆమె సాహసానికి మురిసిపోయాడు. తనకు చాలా గర్వంగా ఉందని, తన కంటే వేగంగా పరుగెత్తి మరీ అతని ప్రాణాలు రక్షించిందని చెప్పాడు.

English summary
This Chinese Bride is 'Most Beautiful' and Not Because of How She Looks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X