ప్రవాస భారతీయ దంపతులు: రూ. 650 కోట్లు విరాళం
న్యూయార్క్: ప్రవాస భారతీయ దంపతులు న్యూయార్క్ యూనివర్సిటీకి భారీగా విరాళాలు ప్రకటించారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయ దంపతులు రంజన్ టాండన్, చంద్రిక టాండన్ దంపతులు న్యూయార్క్ యూనివర్సిటికి రూ. 650 కోట్లు విరాళాంగా ఇస్తున్నారు.
ఈ వారంలోనే రూ. 650 కోట్ల మొత్తాన్ని న్యూయార్క్ యూనివర్సిటికి అందజేస్తామని టాండన్ దంపతులు ప్రకటించారు. ఎన్ వైయూ పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరుకు టాండాన్ దంపతుల పేర్లు పెడుతున్నారు.

ఎన్ వైయూ పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కు ఎన్ వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ గా మార్చనున్నారు. భారత్ లోని అహ్మదాబాద్ ఐఐఎమ్ నుంచి చంద్రిక టాండన్ ఎంబీఏ పూర్తి చేశారు.
అదే విదంగా ఐఐటీ నుంచి రంజన్ టాండన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వీరిద్దరు 37 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. పెప్సీ చీఫ్ ఇంద్ర నూయికి చంద్రిక టాండన్ అక్క అవుతారు. టాండన్ దంపతులకు న్యూయార్క్ యూనివర్సిటి ధన్యవాదాలు తెలిపింది.












Click it and Unblock the Notifications