నారీ నారీ నడుమ మురారీ: ఈ పెళ్లి వైరల్ అయ్యింది... ఎందుకో తెలుసా..?

ఇండోనేషియా: ఇండోనేషియాలో ఓ వివాహం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఓ వ్యక్తి ఇద్దరు యువతులను ప్రేమించాడు. ముందుగా ఒకరిని ప్రేమిస్తున్నట్లు మరొకరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ పెళ్లి దగ్గరే దొరికిపోయాడు. అంటే ఇద్దరినీ చాలా సిన్సియర్‌గా ప్రేమించిన వ్యక్తి ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేయలేకపోయాడు. దీంతో ఇద్దరిని ప్రేమిస్తున్నట్లు చెప్పడమే కాదు... ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని కూడా వారికి మాట ఇచ్చాడు. ముందుగా కాస్త ముభావంగా ఉన్నప్పటికీ ఆ ఇద్దరు యువతులు ఒక అవగాహనకొచ్చి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పారు.

Indonesia marriage

ప్రేమించిన వ్యక్తి చాలా నిజాయితీగా ఉండటంతో ఇద్దరు యువతులు సర్దుకుపోయారు. ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ పెళ్లి ఇండోనేషియాలో టాక్‌ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇద్దరి యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నెటిజెన్లు తమకు తోచినట్లుగా ఫన్నీ కామెంట్స్ పెట్టారు. సాధారణంగా ముస్లిం ఆచారం ప్రకారం ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండొచ్చు. అయితే వారిని పోషించగలిగే శక్తి ఉంటే ఆ వ్యక్తి రెండు వివాహాలు చేసుకోవచ్చు. ఇది ఖురాన్‌లో ఉంది. ఇక ఇండోనేషియా చట్టాల ప్రకారం ఓ వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు. అయితే మొదటి భార్య అంగీకారం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇక్కడ ఈ ప్రేమికుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవడంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. పైగా ఇద్దరి మహిళలకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఒకరిని వదిలి మరొకరిని వివాహం చేసుకునేందుకు తన మనసు అంగీకరించలేదని అందుకే వారిని ఒప్పించి ఇద్దరినీ పెళ్లి చేసుకున్నట్లు వ్యక్తి చెప్పాడు. ఇక ఇద్దరు యువతులు సర్దుకుపోతున్నారని చెప్పాడు. ముగ్గురు కలిసి జీవితం పంచుకునేందుకు చక్కగా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి వేదికైంది ఇండోనేషియాలోని కాలిమన్‌తన్లో ఉన్న ఎయిర్‌తరాప్ అనే ప్రాంతం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+