అదృష్టం అంటే ఇతగాడిదే: లాటరీలో ఈ వ్యక్తికి ఎంత డబ్బు తగిలిందో తెలుసా..?

Recommended Video

    This Lucky Man Wins One Million Dollars In Dubai Lottery అదృష్టం అంటే ఇతగాడిదే

    అదృష్టం ఆ వ్యక్తికి జలుబు పట్టినట్లు పట్టింది. ఒక్క రాత్రిలో కొన్ని కోట్లు అతని అకౌంట్‌లోకి వచ్చి చేరాయి. ఇంకేముంది మనోడి ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు...ఎక్కడుంటాడు అని అనుకుంటున్నారా... తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ...

    దుబాయ్‌లో నివసించే భారత సంతతి వ్యక్తి సందీప్ మీనన్‌ కదిలిస్తే ఇప్పటికీ అదే షాక్‌లోనే ఉన్నాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ తీసిన డ్రాలో సందీప్ మీనన్‌ను అదృష్టం వరించింది. ఒకటి కాదు ... రెండు కాదు.. ఏకంగా ఒక మిలియన్ డాలర్ల లాటరీ సందీప్ మీనన్‌కు తగిలినట్లు అక్కడి స్థానిక పత్రిక ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. ఎప్పటిలాగే సందీప్ ఉదయం నిద్రలేవగానే పేపర్ చదివాడు.

    This lucky man wins One million dollars in Dubai lottery

    పేపర్లో తన పేరు కనపడగానే ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాడు. కళ్లను బాగా రుద్దుకుని పెద్దవిగా చేసి మళ్లీ పేపర్‌ను చూశాడు. అంతే... ఉన్న స్థలంలోనే పెద్దగా కేకలు వేస్తూ గాల్లోకి ఎగిరాడు. తన పేరుతో లాటరీ తగిలిందని తెలుసుకుని గంతేశాడు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు సందీప్ మీనన్. ఎవరైనా మాట్లాడేందుకు వెళితే ఆ ఆనందంలోనే ఉన్నాడు.

    This lucky man wins One million dollars in Dubai lottery

    ఇక అసలు విషయానికొస్తే దుబాయ్‌లో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ సంస్థ లాటరీ డ్రా నిర్వహిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ డ్రాలో ఎక్కువగా అదృష్టవంతులైంది మన భారత సంతతికి చెందిన వారే. 1999లో ఈ కంపెనీ స్థాపించిన నాటి నుంచి అందులో నిర్వహించిన లాటరీ డ్రాలో ఇప్పటి వరకు 132 మంది భారతీయులు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. "నా జీవితంలో ఇప్పటి వరకు ఏమీ గెలుచుకోలేదు. అది కూడా ఇంత పెద్ద మొత్తంలో అస్సలు గెలవలేదు. ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన దుబాయ్ డ్యేటీ ఫ్రీ సంస్థకు ధన్యవాదాలు" అని సందీప్ మీనన్ తెలిపాడు. ఇదిలా ఉంటే లక్కీ డ్రాలో శాంతి బోస్ అనే మరో భారత సంతతి వ్యక్తి అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ ఆర్ 9 టీ స్క్రాంబ్లర్ బైక్‌ను గెలుచుకున్నాడు. దుబాయ్‌లో నివసించే ఈజిప్టు వ్యక్తి హోసం హుస్సేన్ సల్మాన్ కూడా ఖరీదైన వాహనం లక్కీ డ్రా ద్వారా గెలుపొందాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+