అతనికి 13 మంది భార్యలు, అందరూ గర్భవతులే!
అబూజా: నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడు ఏకంగా 13 మందిని పెళ్ళి చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన భార్యలు అందరూ కూడా ఒకేసారి గర్భం దాల్చారు. అతను తన భార్యలందరినీ ఎంతో అన్యోన్యంగా చూసుకుంటున్నాడు.
వారంతూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఏక కాలంలో గర్భం దాల్చడం పట్ల కూడా వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిండు చూలాలైన ఈ 13 మంది భార్యలు మూడు నుంచి ఐదు వారాల తేడాతో బిడ్డలకు జన్మనివ్వనున్నారు.

దీంతో ఆ వ్యక్తి ఏక కాలంలో పదమూడు మంది సంతానానికి తండ్రయ్యే ఘనతను అతను సొంతం చేసుకోనున్నాడు. ఇందుకు సంబంధించిన వార్త, ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ అవుతోంది. అయితే, ఈ ఫోటో, వార్తలో నిజమెంతో కూడా తెలియదని అంటున్నారు.












Click it and Unblock the Notifications