భార్య ప్రసవం ఫేస్ బుక్ లో లైవ్ : స్నేహితులకు చూపించి మురిసిపోయాడు
అయిందానికి.. కానిదానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయడం, అవతల మనిషి చస్తున్నా సరే..! ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకుందామన్న తరహాలో లైకులు కామెంట్ల పబ్లిసిటీలో కొట్టుకుపోతున్నారు చాలామంది. తాజాగా అమెరికాకు చెందిన ఫకమలో కిహే ఎకీ అనే వ్యక్తి.. ఏకంగా తన భార్య ప్రసవాన్ని ఫేస్ బుక్ ద్వారా లైవ్ లో తన స్నేహితులందరికీ చూపించాడు.

భార్యకు ప్రసవ నొప్పులు మొదలైనప్పటి నుంచి, బిడ్డను కనేదాకా.. మినిట్ టు మినిట్ ప్రతీ సీన్ ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. అన్ని యాంగిల్స్ నుంచి కవర్ చేసిన ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఫేస్ బుక్ ద్వారా సదరు భర్త స్నేహితులంతా వీక్షించారు. ఆమె ప్రసవ వేదనను చూసి, ఆమెను ప్రోత్సహిస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోన్న 45 నిమిషాలు గల ఈ వీడియోను ఇప్పటివరకు 23 వేల మంది చూసినట్టుగా సమాచారం. ఏదేమైనా.. ప్రసవం సమయంలో భార్యకు అండగా ఉండాల్సింది పోయి పబ్లిసిటీ కోసం ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడమేంటో విడ్డూరం.












Click it and Unblock the Notifications