శృంగార ధీరుడు: అమ్మాయిలే ఇతగాడి వీక్‌నెస్.. జీవితంలో ఏంసాధించాడో తెలుసా..?

అతనికి డబ్బులున్నాయి... రోజుకో దేశం తిరిగేవాడు.. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపాడు... ఏదేశం వెళ్లినా అక్కడ తన సుఖం కోసం ఒక మహిళతో పడకను పంచుకునేవాడు. ఇక ఆ జీవితం ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకున్నాడు. మందు విందు పొందు ఈ మూడే తన జీవితాన్ని శాసించాలని భావించాడు. తన జీవితంలో మందు ఉన్నా లేకున్న మగువ మాత్రం ఉండాలని తపించాడు. అంతలా అమ్మాయిలతో తన సరదా తీర్చకున్నాడు.

వివాహం లేకుండా మగువలతో ఎంజాయ్

వివాహం లేకుండా మగువలతో ఎంజాయ్

కేవలం అమ్మాయిలతో లైంగిక జీవితం గడిపేందుకే పెళ్లి కూడా చేసుకోలేదు. వండుకున్న వాడికి ఒక కూర.. అడుక్కునే వాడికి అరవై కూరల కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యాడు. పెళ్లి చేసుకుంటే ఒకరితోనే లైంగిక జీవితం పంచుకోవాల్సి ఉంటుందని అదే వివాహం అనే కాన్సెప్టే లేకుంటే ఎంతో మంది మహిళలతో శృంగారం పంచకోవచ్చిన భావించాడు. అదే ఫాలో అయ్యాడు కూడా. తన జీవితంలో ఎంతలేదన్న కొన్ని వేళ మంది మహిళలతో పడక పంచుకుని ఉంటాడు. ఇది తనే స్వయంగా చెప్పాడు.

వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితమంతా మగువలే

వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితమంతా మగువలే

శృంగారంలో ఎంతటి రసికుడైనా ఏదో ఒక సమయంలో దానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. ఇదే జరిగింది ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయంలో కూడా. యుక్త వయస్సులో అమ్మాయిలతో తెగ ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పుడు ఆయన వయస్సు 61 ఏళ్లు. ఈ వయసులో అమ్మాయిలతో ఎంజాయ్ చేసే సత్తా తనకున్నా... అమ్మాయిలు ఈ ముసలి బ్యాచిలర్‌తో గడిపేందుకు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఈ వృద్ధ బ్రహ్మచారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ 61 ఏళ్లలో డబ్బు సంపాదన కాకుండా ఏమి సాధించాడో అని ఒక్కసారి వెనక్కి చూస్తే ఆయన బాగోతమంతా అమ్మాయిలతోనే ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు. ఇప్పుడు తనకు ఒక కుటుంబం ఉంటే బాగుండును కదా అని పరితపిస్తున్నాడు.

పిల్లలు ఉన్నారో లేదో కనుక్కునేందుకు డిటెక్టివ్ నియామకం

పిల్లలు ఉన్నారో లేదో కనుక్కునేందుకు డిటెక్టివ్ నియామకం

తను అంతమంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు కదా.. పొరపాటున తన ద్వారా ఏ అమ్మాయి అయినా గర్భం దాల్చి కొడుకో కూతురునో కని ఉంటుందేమో అన్న ఆశ అతనిలో మెదిలింది. ఈ వయస్సులో తన ఆస్తిని చూసుకునేందుకు వారసుల కోసం వేట మొదలు పెట్టాడు .ఇందులో భాగంగానే ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఆన్‌లైన్ ద్వారా తన పరిస్థితిని విరించాడు. తాను యూరప్ దేశాలకు బిజినెస్ ట్రిప్‌పై వెళ్లిన సమయంలో అందమైన మగువలతో గడిపినట్లు చెప్పాడు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియాలాంటి దేశాల్లో పర్యటించిన సమయంలో ఆదేశ అమ్మాయిలతో విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆసక్తిగల డిటెక్టివ్ ఈ దేశాల్లో పర్యటించి తాను ఇచ్చే అమ్మాయిల జాబితా తీసుకుని వెళ్లి వారికి తన ద్వారా ఎవరైనా పిల్లలు కలిగారో లేదో కనుక్కుని తనకు సమాచారం ఇవ్వాలి. ఇందుకు 5వేల పౌండ్లు జీతంగా చెల్లించనున్నట్లు ప్రకటనలో తెలిపాడు శృంగార పురుషుడు.

జాగ్రత్తలు పాటించలేదు.. పిల్లలు కలిగి ఉండొచ్చేమో అన్న ఆశ

జాగ్రత్తలు పాటించలేదు.. పిల్లలు కలిగి ఉండొచ్చేమో అన్న ఆశ

అప్పట్లో శృంగార సమయంలో తగు జాగ్రత్తలు తీసుకునేంత అవగాహన లేదని... ఇప్పుడు అదే విషయం తనకు కలిసొచ్చే అవకాశం ఉందన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడు. ఎవరైనా గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చి ఉంటారేమో అని భావిస్తున్నాడు. అంతేకాదు అప్పట్లో తనకు కుటుంబం అంటే కుటుంబ విలువలంటే ఏమిటో తెలియలేదని.. ఇప్పుడు తనకు ఓ కుటుంబం ఉంటే బాగుంటుందనిపిస్తోందన్నాడు. ఒకవేళ నా అన్న వాళ్లు లేకుంటే ఆ బాధ జీవితాంతం తన గుండెల్లోనే ఉండిపోతుందని అందుకే ఎక్కడున్నా సరే తన వారసుడిని వెతికి పట్టుకుంటానేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పాడు ఈ 61 ఏళ్ల వృద్ధుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+