ఆఫర్: గర్ల్ ఫ్రెండ్‌ని వెతికిస్తే 10వేల డాలర్లు ఇస్తాడట!

న్యూయార్క్: మనం మనకు కావాల్సింది దొరకాలంటే అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. అదే ప్రియురాలి వెతకడం కోసమైతే మరింత కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తనకు ‘ప్రియురాలిని వెతికిపెట్టండి.. భారీ బహుమతి కొట్టేయండి' అంటూ ఓ బంపర్ ఆఫర్ పెట్టాడు.

తనకు నచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌ను వెతికిపెట్టిన వారికి 10వేల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. అమెరికాలోని అలబామాకు చెందిన రెన్‌ యు(29) ఇటీవలే హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.

This man will pay you $10,000 if you find him a girlfriend

మంచి సంస్థలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే అతనికి ఒకటే బాధ. 10నెలలుగా తనకు నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతున్నా దొరకడంలేదు. అయినా సరే తన ప్రయత్నం మానలేదు రెన్‌. తనతోపాటు ఇతరులను కూడా వెతికించే పనిలో పెట్టాలనుకున్నాడు.

దీంతో వెంటనే తనకు నచ్చిన అమ్మాయిని వెతికిపెడితే 10వేల డాలర్ల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఇందుకోసం సొంతంగా ఓ వెబ్‌సైట్‌(డేట్‌రెన్.కామ్)ను కూడా ప్రారంభించాడు. తనకు తగిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారనుకుంటే వారి వివరాలు అందులో పేర్కొనమని కోరుతున్నాడు రెన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+