కింగ్ జాంగ్ ఉన్ దూకుడు: మరో అణు పరీక్షకు సిద్ధమయ్యాడా?
ఉత్తర కొరియా మరో క్షిపణి దాడికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారంలో అమెరికా, సౌత్ కొరియాలు సంయుక్తంగా నావికా దళ విన్యాసాలు చేయనున్నాయి.
Recommended Video

ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా మరో క్షిపణి దాడికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారంలో అమెరికా, సౌత్ కొరియాలు సంయుక్తంగా నావికా దళ విన్యాసాలు చేయనున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మధ్యంతరస్థాయి క్షిపణిలను ప్రయోగించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన మీడియాలో వార్తలు వచ్చాయి. ప్యోగ్‌యాంగ్ సమీపంలో ఈ రెండు క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చినట్లు పేర్కొంది.

అమెరికా వెస్ట్ కోస్ట్‌ను చేరుకునే సామర్థ్యం
హవసాంగ్ 14 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించనున్నట్లుగా భావిస్తున్నారు. దీంతో పాటు హవసాంగ్ 13 ఐసీబీఎంను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికా వెస్ట్ కోస్ట్‌ను చేరుకునే సామర్థ్యం ఈ క్షిపణికి ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు ద.కొరియా రక్షణశాఖ ప్రతినిధి నిరాకరించారు.

ధీటుగా బదులిచ్చేందుకు అమెరికా
అయితే ఉత్తర కొరియా చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. వరుస ప్రయోగాలతో ఇబ్బందులకు గురి చేస్తున్న ఉత్తర కొరియాకు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది.

కొరియన్ పెనిన్సులాపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు
ఇందులో భాగంగానే ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పుపై ఎలా స్పందించాలనే అంశంపై రక్షణశాఖ అధికారులతో ట్రంప్ చర్చలు జరిపారు. మరోవైపు కొరియన్ పెనిన్సులాపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి.

అమెరికా శాటిలైట్లు
కాగా, అమెరికాపై దాడి చేస్తామని హెచ్చరిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ ప్యోంగ్ యాంగ్ సమీపానికి క్షిపణులు తరలిస్తున్నట్లుగా అమెరికా శాటిలైట్లు తీసిన చిత్రాల ద్వారా తెలిసింది.












Click it and Unblock the Notifications