జంతు బలి లేకుండానే బక్రీద్ జరుపుకున్న ఏకైక ముస్లిం దేశం..! షాకింగ్ రీజన్..!
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. దీన్నే ఈద్ అల్-అధా అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా దైవం కోసం తన కుమారుడిని సైతం బలిచ్చేందుకు సిద్దమైన ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా మేకపోతుల్ని బలి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఖురాన్ ప్రకారం చూసినా బక్రీద్ పండుగ రోజు ప్రతీ ముస్లిం తన ఇంట్లో జంతు బలి ఇవ్వాల్సిందే. ఇలా మేకపోతులతో పాటు ఒంటెల్ని కూడా బలి ఇస్తుంటారు.
జంతుబలి లేకుండానే మొరాకోలో బక్రీద్
అలా బక్రీద్ అంటేనే జంతు బలి తప్పకుండా ఉంటుంది. కానీ ఓ ముస్లిం దేశం ఈసారి జంతు బలి లేకుండానే బక్రీద్ పండుగను చేసుకుంది. ముస్లిం దేశమైన మొరాకో.. ఈసారి సంప్రదాయ గొర్రెల బలి లేకుండానే బక్రీద్ పండుగ జరుపుకుంది.
మొరాకో రాజు మొహమ్మద్ VI ఈ మేరకు ఇచ్చిన అరుదైన ఆదేశమే దీని వెనుక కారణం. ఇది ఆయన పాలనలో తొలిసారిగా జరిగింది. అయితే గతంలోనూ రాజు ఉన్న హసన్ II హయాంలో 1963, 198, 1996లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.

- జంతు బలి లేకుండానే బక్రీద్ జరుపుకున్న మొరాకో
- మొరాకోలో ఈ ఏడాది బక్రీద్ కు జంతు బలి నిషేధం
- జంతు బలిని నిషేధిస్తూ రాజు మొహమ్మద్ VI సంచలన ఆదేశాలు
ఇంతకీ మొరాకోలో జంతు బలిని ఎందుకు నిషేధించారు ?
మొరాకో వరుసగా ఏడు సంవత్సరాలు కరువును చూసింది. 2016 నుండి గొర్రెలు, పశువుల మందలు దాదాపు 38 శాతం తగ్గిపోయాయి. అలాగే దిగుమతి చేసుకున్న బార్లీ, గడ్డిపై ఆధారపడటం వల్ల పెరుగుతున్న మేత ఖర్చులు పశువుల పెంపకందారుల ఖర్చులను మూడు రెట్లు పెంచాయి. 2024లో బలి ఇచ్చే గొర్రె ధర 600 డాలర్ల వరకు ఉంది. ఇది మొరాకోలో కనీస నెలవారీ వేతనం 324 డాలర్ల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఇది చాలా మందికి ఈ సంప్రదాయాన్ని భరించలేనిదిగా మార్చేసింది.
రాజు ఆదేశాల వెనుక షాకింగ్ రీజన్
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజు మొహమ్మద్ VI మొరాకో ప్రజల్ని జంతువులను కొనడం, బలి ఇవ్వడం మానుకోవాలని పిలుపునిచ్చారు. ఇది తక్కువ ఆదాయ కుటుంబాలపై కఠినమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు భయంతో కూడిన కొనుగోలు, ధరల దోపిడీని నివారించడానికి అధికారులు పండుగకు ముందు అనేక పశువుల మార్కెట్లను మూసివేశారు. పశువులపై దిగుమతి సుంకాలు తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రభుత్వం ఆస్ట్రేలియా నుండి లక్ష గొర్రెలను దిగుమతి చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. దాణా ఖర్చులపై రాయితీ ఇచ్చేందుకు, అప్పులను రీషెడ్యూల్ చేయడానికి, సంక్షోభం వల్ల ప్రభావితమైన పశువుల కాపరులకు మద్దతు ఇవ్వడానికి 6.2 బిలియన్ దిర్హామ్ ల ఉపశమన ప్యాకేజీని ప్రారంభించారు.
⚡️⚡️Breaking: Morocco becomes the first country to ban animal sacrifice for Eid al-Adha due to severe drought and economic strain, a historic move by King Mohammed VI.
— Rahul Kumar (@RealRavani) June 7, 2025
Will this set a precedent? 🇲🇦🌍 #Morocco #EidAlAdha #AnimalWelfare pic.twitter.com/PAyMYpA1DN
బక్రీద్ పై జంతుబలి నిషేధం ప్రభావం..
ముఖ్యంగా పట్టణ, శ్రామిక-తరగతి ప్రాంతాలలోని అనేక కుటుంబాలు, కష్ట సమయాల్లో ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం పొంది రాజు ఇచ్చిన ఆదేశాన్ని స్వాగతించాయి. అయితే గ్రామీణ పశువుల కాపరులు గణనీయంగా ఆదాయం కోల్పోయారు. కొందరు ఈద్ ఆదాయంలో 50 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. స్థోమత సమస్యగా ఉన్నప్పుడు ఖుర్బానీ తప్పనిసరి కాదని మొరాకో అంతటా ఇస్లామిక్ పండితులు తేల్చిచెప్పారు. బదులుగా విరాళాలు, దాతృత్వ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. జాతీయ ఐక్యత , సామూహిక విశ్వాసాన్ని సూచిస్తూ రాజు మొరాకో ప్రజల తరపున త్యాగం చేశాడు. అనేక కుటుంబాలు గొర్రె మాంసం బదులుగా చికెన్, గొడ్డు మాంసం వండుకున్నాయి. దుకాణంలో కొనుగోలు చేసిన మాంసాన్ని బంధువులకు మరియు పేదలకు పంపిణీ చేశాయి. అలా పండుగ యొక్క దాతృత్వ నీతిని సజీవంగా ఉంచాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications