వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతికేళ్లుగా.. ఆకులు, చెట్ల బెరడే ఈయన ఆహారం!

ఓ వ్య‌క్తి ఆకులే తిని బతుకుతున్నాడు. ఏదో ఒకటి, రెండు రోజులు, నెలలు కాదు.. పాతికేళ్లుగా అతడి ఆహారం అదే.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పంజాబ్: ఓ వ్య‌క్తి ఆకులే తిని బతుకుతున్నాడు. ఏదో ఒకటి, రెండు రోజులు, నెలలు కాదు.. పాతికేళ్లుగా అతడి ఆహారం అదే. ఆకులు, చెట్టు బెరడు తప్ప ఇంకేమీ తినడు. ఈ పరిస్థితికి కారణం పేదరికమే. భోజనం చేయడానికి కూడా డబ్బుల్లేక కటిక పేదరికం అనుభవిస్తూ చెట్ల ఆకులనే ఆహారంగా మార్చుకున్నాడు.

పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాకు చెందిన మెహమూద్‌ పేద‌వాడు. ఇత‌రుల ముందు చేయి చాచి అడుక్కోవడం ఇష్టంలేక ఇలా చెట్ల ఆకులు, బెరడులు తింటున్నాన‌ని చెబుతున్నాడు.

This Pakistani man has been eating leaves for 25 years and has never fallen ill

చేతిలో డ‌బ్బుల్లేక‌, చేయడానికి ప‌ని దొర‌క‌క‌ దుర్భ‌ర జీవితాన్ని గ‌డుపుతున్న‌ప్ప‌టికీ అత‌డు ఇన్నాళ్లూ సంతోషంగానే ఉన్నాడు. అంతేకాదు, తాను ఆకులు తింటూ బ‌తుకుతుండ‌డంతో త‌న‌ తిండికి ఏ లోటూ లేదని చెబుతున్నాడు.

అయితే ఇప్పుడు మెహమూద్ కు పని కూడా దొరికింది. దీంతో ఇప్పుడు కాస్త డ‌బ్బు సంపాదిస్తున్నప్ప‌టికీ ఆహారంగా మాత్రం ఇన్నేళ్లూ త‌న‌కు అలవాట‌యిపోయిన ఆకులే తింటున్నాడు. పాతికేళ్లుగా ఆకులే తిని బతుకుతున్నా ఎలాంటి జబ్బు దరిచేరకపోవడం ఆశ్చర్యమే.

This Pakistani man has been eating leaves for 25 years and has never fallen ill

మెహమూద్‌ ఇప్పటివరకూ హాస్పిటల్‌కి వెళ్లింది లేదని.. ఓ మనిషి పాతికేళ్లుగా చెట్ల ఆకులు, బెరడ్లు తింటూ అనారోగ్యం పాలవకుండా ఎలా ఉంటాడని స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

English summary
Punjab: Mehmood Butt, a poor man from Gujranwala has been eating leaves and wood for the last 25 years, a habit he developed because of extreme poverty and since then he has lived on eating leaves and surprisingly, has never fell ill. According to a news report, Butt, 50, started eating leaves 25 years ago because he had no work and couldn’t afford basic meal. 'There was too much poverty in my family. Everything was beyond limit and it was very difficult for me to get a meal, so I thought it is better to eat wood rather than begging on a street,’ Butt said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X