• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిన్న డ్యాన్సింగ్ అంకుల్.. నేడు సింగింగ్ అంకుల్: పాటతో దుమ్మురేపుతున్న పాకిస్తానీ పెయింటర్

|

పాకిస్తాన్ : టాలెంట్‌ను గుర్తించడంలో ఇంటర్నెట్ తర్వాతే ఎవరైనా.. సోషల్ మీడియా గుర్తించినట్లుగా ఒక వ్యక్తిలోని ప్రతిభను ఎవరూ గుర్తించలేరు. మొన్నటి వరకు డ్యాన్సింగ్ అంకుల్‌ సంజీవ్ శ్రీవాస్తవను సైతం ఒక్కరాత్రిలోనే హీరో చేసేసింది సోషల్ మీడియా. తాజాగా మరో వ్యక్తిని కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇదిగో ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు మొహ్మద్ ఆరిఫ్. ఇతను పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి . పెయింటర్‌గా పనిచేసే ఆరిఫ్... ఇప్పుడు సోషల్ మీడియా సంచలనంగా మారాడు .ఎందుకో మీరే చదవండి.

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ అన్నాడు ఓ సినీ కవి. అందుకే కాబోలు ఆరిఫ్ అనే ఈ వ్యక్తి అలసటను మరిచేందుకు పాటలు పాడుతున్నాడు. ఇప్పుడు ఆ పాటే ఆయన్ను హీరోను చేసింది. పనిచేసుకుంటూ ఒక పాటను ఫేస్‌బుక్ లైవ్‌లో పాడాడు ఆరిఫ్. ఆ పాటే నెటిజెన్లను ఆకట్టుకుంది. కాదు కాదు పాటకంటే నెటిజెన్లు ఆరిఫ్ వాయిస్‌కు ఫిదా అయ్యారు. వెంటనే వీడియోను షేర్ చేశారు. పనిచేస్తూనే ఒక పాట వెనక మరో పాట పాడుతూ అలసటకు స్థానం ఇవ్వడట ఆరిఫ్.

This Pakistani painter became an internet sensation,you know why?

ఆగష్టు 1న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడే 30 లక్షల 70వేల వ్యూస్ ఈ వీడియోకు వచ్చాయి. అంతేకాదు 96వేల రియాక్షన్స్‌తో పాటు 66వేల షేర్లు కూడా వచ్చాయి. ఒక్క ఫేస్‌బుక్‌లో మాత్రమే మనోడి వీడియో వైరల్ కాలేదండి... ట్విటర్‌తో పాటు ఇతరత్ర సోషల్ మీడియా సైట్స్‌లో కూడా వైరల్ అయ్యాయి. వేలకొద్దీ లైక్స్‌లు షేర్లు వస్తున్నాయి.

This Pakistani painter became an internet sensation,you know why?

మహ్మద్ ఆరిఫ్ వాయిస్ సూపర్‌గా ఉంది. ఇతని పాట వింటుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మెస్మరైజింగ్ వాయిస్. ఆ వాయిస్‌లో ఏదో మాయవుంది. గంటల తరబడి ఆ గొంతు నుంచి వచ్చే పాటలను వినాలని ఉంది. కచ్చితంగా సెలబ్రిటీ అయ్యే అన్ని అర్హతలు ఆరిఫ్‌లో ఉన్నాయంటూ ఓ ఫేస్‌బుక్ యూజర్ కామెంట్ చేశాడు. సహజ సిద్దమైన వాయిస్, అద్భుతంగా పాడాడు. ఎవరైనా ఆరిఫ్‌కు ఒక అవకాశం ఇస్తారని ఆశిద్దాం... అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. చాలామంది ట్విటర్ వినియోగదారులు @cokestudio ట్యాగ్ చేసి తనకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని social media వార్తలుView All

English summary
If you remember the dancing uncle Sanjeev Srivastava who became a internet star with his dance, a similar talented person Arif from Pakistan is now the social media hero with his songs. Arif who is a painter by profession is now a sensation on social media.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more