చూస్తే ఆరడగుల బుల్లెట్‌లా.. ఎలుకను చూసి పోలీస్ బెంబేలు(వీడియో)

ఫ్లోరిడా: ఆ పోలీసు చూస్తే ఆరడగుల బుల్లెట్‌లా ఉన్నాడు. కానీ, ఓ చిన్న ఎలుకను చూసి భయంతో పరుగు పెట్టాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ నెటిజన్లకు నవ్వులు పంచుతోంది.

వివరాల్లోకి వెళితే... సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో సదరు పోలీస్‌ అధికారి ఓ ఎలుకను చూసి ఏదో క్రూర మృగాన్ని చూసినట్లు పరిగెత్తాడు. ఎలుక పోయిన తర్వాత కూడా అది పోయిందా? లేదా? అని అటు ఇటు చూసుకుంటూ వెళ్లిపోయాడు.

కాగా, ఆ పోలీస్‌ పరిగెడుతున్న ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియోచూసి నెటిజన్లు ఎలుకకే భయపడే వారు క్రిమినల్స్‌ని ఏం పట్టుకుంటాడంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+