ఆరేళ్లకే అంబానీ కూడా ఇంత సంపాదించి ఉండరు: ఈ బుజ్జాయి సంపాదన ఎంతో తెలుసా..?

సియోల్ : పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో. సాంకేతికంగా ప్రపంచం ముందుకు దూసుకెళుతోంది. ఆ సాంకేతికతను అందిపుచ్చుకుని మానవుడు కూడా అంతే వేగంతో దూసుకెళుతున్నాడు. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఆరేళ్ల వయసులోనే సంపాదన విషయంలో ఓ చిన్న సైజు అంబానీని తలపిస్తోంది. ఇంతకీ ఎవరా చిన్నారి.. ఆమె సంపాదన ఏంటి..?

ఆరేళ్ల వయస్సులోనే ఇంత సంపాదనా..?

ఆరేళ్ల వయస్సులోనే ఇంత సంపాదనా..?

ఇదిగో... ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బుంగమూతి బుజ్జాయి పేరు బోరమ్. వయస్సు ఆరేళ్లు. ఈ బుజ్జాయి వయస్సు ఆరేళ్లు మాత్రమే.. కానీ ఈమె సంపాదన చూస్తే వావ్ అని నోరెళ్లబెట్టాల్సిందే. అసలు ఆరేళ్ల వయస్సులో అంబానీ కూడా అంత సంపాదించి ఉండడేమో. అంతలా ఈమె సంపాదన ఉంది. సంపాదన అంటున్నారు.. ఈమె ఏమి పనిచేస్తోందనేగా మీడౌటు. అక్కడికే వస్తున్నాం.

 యూట్యూబ్ ఛానెల్‌కు 30 మిలియన్ సబ్‌స్క్రైబర్లు

యూట్యూబ్ ఛానెల్‌కు 30 మిలియన్ సబ్‌స్క్రైబర్లు

ఈ ముద్దులొలికించే బుజ్జాయి యూట్యూబ్‌లో రెండు ఛానెల్స్‌ను ప్రారంభించింది . అవి బోరమ్ ట్యూబ్ వ్లాగ్ ఒకటి కాగా రెండోది బోరమ్ ట్యూబ్ టాయ్ రివ్యూ. ఈరెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఎంతమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారో తెలుసా.. ఏకంగా 30 మిలియన్ సబ్‌స్క్రైబర్లు. ఇందులో ఏ పాటలో లేక ఏ డ్యాన్సు వీడియోలో ఉండవు. మార్కెట్లోకి వచ్చే కొత్త బొమ్మల గురించి రివ్యూ ఇస్తుంది. ఆమె చేసే పని అంతే. అంతకంటే ఎక్కువకాదు.

 ఆరేళ్ల వయస్సులో రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తి సొంతం

ఆరేళ్ల వయస్సులో రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తి సొంతం

ఇక ఈమె సంపాదనతో ఏకంగా మన కరెన్సీలో రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆరేళ్ల వయసులోనే కొనేసింది.చెంగ్డామ్-డాంగ్,గగ్నామ్‌లో 258.3 చదరపు అడుగుల్లో నిర్మించిన 1975 నాటి భవంతి ఒకటి కొనేసింది. అది కూడా సియోల్‌లోని ఓ వీఐపీ ఏరియాలో కొనింది. ఈ యూట్యూబ్ స్టార్‌ నెల ఆదాయం 2.4 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా 20 కోట్ల 46 లక్షల 14వేల రూపాయలు. వామ్మో ఈ సంపాదన చూస్తేనే దిమ్మ తిరిగిపోతోంది కదూ.. ఇక కొరియన్ యూట్యూబ్ ఛానెల్స్‌లో బోరమ్‌దే అత్యధిక వాటా ఉంటుదట.అంతేకాదు ఈ బుజ్జాయి కొన్ని బ్రాండ్లతో కూడా జతకట్టింది. ఆ బ్రాండ్ల ద్వారా కూడా ప్రమోట్ చేస్తుంది. వాటి నుంచి కూడా సంపాదిస్తోంది. మొత్తానికి ఆరేళ్ల వయస్సులోనే నెలకు 20 కోట్లకు పైగా బోరమ్ సంపాదిస్తోందంటే నిజంగానే పిట్టకొంచెం కూత ఘనం అని ఇలాంటి వారినే అంటారేమో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+