వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ ఆహ్వానం అన్నందుకు అమ్మాయి బర్త్‌డేకు 10వేలమంది వచ్చారు

అందరూ ఆహ్వానితులే అని చెప్పినందుకు ఓ పదిహేనేళ్ల యువతి పుట్టిన రోజు వేడుకలకు ఏకంగా వేలాది మంది వచ్చారు.

|
Google Oneindia TeluguNews

మెక్సికో: అందరూ ఆహ్వానితులే అని చెప్పినందుకు ఓ పదిహేనేళ్ల యువతి పుట్టిన రోజు వేడుకలకు ఏకంగా వేలాది మంది వచ్చారు. సెంట్రల్ మెక్సికోలో రూబీ ఇబర్రా తన పదిహేనో పుట్టిన రోజు వేడుకలు సోమవారం నాడు జరుపుకుంది.

అయితే, అంతకుముందు ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అయింది. అందులో అందరూ ఆహ్వానితులే అని ఉండటంతో.. ఏకంగా లక్షలాది మంది వచ్చేందుకు సిద్ధపడ్డారు.

చివరకు దాదాపు పదివేల మంది ఈ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. పదుల సంఖ్యలో ఫోటో గ్రాఫర్లు, రిపోర్టర్లు కూడా వచ్చారు. 'నా 15వ పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానం' అని పేర్కొంటూ అమ్మాయి ఫోటోను వేశారు.

Thousands attend Mexican girl's 15th birthday party after invite goes viral

ఈ పుట్టిన రోజు వేడుకలకు ఓ విమానయాన సంస్థ అయితే వేడుకకు హాజరయ్యే వారి కోసం టిక్కెట్ల పైన రాయితీ కూడా ప్రకటించిందట. వేలాది మంది రావడంతో.. కేవలం 200 మంది నివసించే ఆ గ్రామంలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.

మెక్సికోలో వివిధ ప్రాంతాల నుంచి పదివేల మంది వరకు వచ్చారు. టెంట్లు, టేబుళ్లు, ఫుడ్ ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే ఓ ఫోటో గ్రాఫర్ ఆమె ఇన్విటేషన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది అందరికీ చేరి, వేలాది మంది వచ్చారు.

English summary
Thousands attend Mexican girl's 15th birthday party after invite goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X