6వేలమంది ఒకేసారి నడిరోడ్డుపై బట్టలిప్పేసి..
కొలంబియా: వేలాది మంది కొలంబియన్లు ఒకేసారి నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. అమెరికన్ ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ మనుషుల్ని సామూహికంగా నగ్న చిత్రాలు తీయడంలో నేర్పరి.
ఆయన సూచనల మేరకు ఆరువేలమంది కొలంబియా ప్రజలు సోమవారం నాడు తమ ఒంటి పైన ఉన్న వస్త్రాలను విప్పేశారు. ఏడు డిగ్రీల చలివాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా శరీరం పైన నూలుపోగు లేకుండా బొగోటా నగరంలోని మెయిన్ సెంటర్లో నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

గత ఆరేళ్ల కాలంలో సదరు ఫోటో గ్రాఫర్ సామూహిక నగ్న చిత్రాలలో ఇదే పెద్దది. కొలంబియాలోని లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న నినాదంతో వీరు సామూహిక నగ్న ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.
తామంతా నగ్నంగా మారిపోవడం సంతోషంగా ఉందని, తాము గర్వాన్ని పక్కన పెట్టి శాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఇది ఐక్యతకు చిహ్నంగా ఉంటుందని, ఇది కొత్త అనుభవమని, మనం ప్రపంచంలోకి ఎలా వస్తామో అలాగే పాల్గొన్నామని.. ఫోటో సెషన్లో పాల్గొన్న వారు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications