హాలీవుడ్ హారర్‌లా..: సిటీలో కోట్లాది సాలె పురుగులు
వాషింగ్టన్: హాలీవుడ్ హారర్ సినిమాను తలపించేలా.. సాలె పురుగులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో గల నార్త్ మెంఫిస్ పట్టణంలో వేలు, లక్షలాది సాలె పురుగులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
హారర్ హాలీవుడ్ సినిమాను తలపించేలా అవి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో సాలె పురుగులు పట్టణంలో సంచరిస్తున్నాయి. అందరి ఇళ్ల పైన, గోడల మీద, తలుపుల మీద, కిటికీల మీద.. ఇలా ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.

దీంతో, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. సాలె పురుగులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. సుమారు కిలో మీటరు పొడవు ఉన్న ఒక సాలెగూడు నుంచి లక్షలాది పురుగులు వస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications