వింత: ఉరేస్తున్నాం చూడాలంటూ సోషల్ మీడియాలో ఆహ్వనం, ఎక్కడంటే?

బీజింగ్: ఉరి తీయడాన్ని తిలకించేందుకు రావాలని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఆహ్వనాలు పంపారు చైనా అధికారులు. ఓ క్రీడా స్టేడియంలో బహిరంగంగా పదిమందిని ఉరి తీశారు. స్కూల్‌ పిల్లలతో సహ పెద్ద ఎత్తున ఈ ఉరి తీసే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించారు.

చైనాలో తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తారు.ఈ శిక్షలను విధించడమే కాదు వాటిని ఖచ్చితంగా అమలు చేస్తారు.అంతేకాదు ఈ రకమైన తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎవరికైనా ఇదే తరహ శిక్షలను అమలు చేస్తామనే సంకేతాలను ఇచ్చేందుకు నిందితులకు ఉరి తీసే కార్యక్రమాన్ని బహిరంగంగా ఏర్పాటు చేశారు.

బహిరంగంగా ఉరి తీస్తున్నామంటూ సోషల్ మీడియాలో ఆహ్వనాలు పంపారు.స్కూల్ పిల్లలను కూడ స్కూల్ నుండి నేరుగాఉరి తీసే ప్రాంతానికి తీసుకువచ్చారు. చైనాలోని గ్యాంగ్‌డాంగ్ ఫ్రావిన్స్‌లోని లుఫెంగ్‌ లో ఈ ఘటన చోటు చేసుకొందన్నారు.

నిందితులకు బహిరంగంగా ఉరి

నిందితులకు బహిరంగంగా ఉరి

మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ను బహిరంగ ఉరి తీయాలని చైనాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీర్పు వెలువడిన వెంటనే 10 మంది ముఠా సభ్యులను గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోని లుఫెంగ్‌ క్రీడా మైదానంలో అధికారులు ఉరి తీశారు.

ఉరి తీస్తున్నామంటూ ఆహ్వనాలు

ఉరి తీస్తున్నామంటూ ఆహ్వనాలు

పది మందిలో ఏడుగురిపై డ్రగ్స్‌ నేరారోపణలు ఉన్నాయి. మరో ముగ్గురిపై హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. కాగా, గ్యాంగ్‌కు శిక్ష ఖరారు కావడానికి నాలుగు రోజుల ముందే సోషల్‌మీడియా ద్వారా బహిరంగ ఉరిని వీక్షించేందుకు అందరూ రావాలని ఆహ్వానాలు పంపారు. శిక్ష ఖరారు అనంతరం పోలీసులు ట్రక్కుల్లో వారిని స్టేడియానికి తీసుకువచ్చారు. అనంతరం అప్పటికే రన్నింగ్‌ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఉరి కంభానికి వారిని వేలాడదీశారు. భవిష్యత్తులో ఎవరూ ఈ తరహ తప్పులు చేసినా ఇదే రకమైన శిక్షలు విధిస్తామనే సంకేతాలు ఇచ్చేందుకు అధికారులు బహిరంగంగా ఉరి తీశారనే అభిప్రాయాలను స్థానిక అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ పిల్లలకు కూడ ఆహ్వనాలు

స్కూల్ పిల్లలకు కూడ ఆహ్వనాలు

నిందితులను ఉరి తీసే సమయంలో స్కూళ్ళ నుండి విద్యార్థులను కూడ పిలిపించారు.ఈ తంతును వేలాది మంది ప్రజలు వీక్షించారు. బహిరంగ ఉరిని తిలకించేందుకు యూనిఫామ్‌లో ఉన్న స్కూల్‌ పిల్లలు కూడా వచ్చారు. ఎందుకు ఉరి తీయాల్సి వచ్చింది అనే విషయాలను కూడ పిల్లలకు వివరించారు.

గత ఏడాది 2 వేల మందికి ఉరి

గత ఏడాది 2 వేల మందికి ఉరి

ఉరి శిక్షను ప్రపంచంలో అత్యధికంగా అమలు చేస్తోన్న దేశం చైనానే. గత ఏడాది దాదాపు 2000 మందిని చైనాలో ఉరి తీసినట్లు రిపోర్టులు ఉన్నాయి. నేర ప్రభావం తీవ్రంగా లేకున్నా చైనాలో ఉరి శిక్ష వేయడం ఎప్పటినుంచో జరుగుతోందని అమెరికాకు చెందిన ఓ మానవహక్కుల సంస్థ పేర్కొంది. అయితే, బహిరంగంగా ఉరి శిక్షను అమలు చేయడం మాత్రం చైనాలో అరుదుగా సంభవిస్తుంటుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+