హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది మృతి
టీవీ షో చిత్రీకరణకు వెలుతున్న సమయంలో రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకోని 10 మంది దుర్మరణం చెందిన సంఘటన అర్జెంటినాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్రెంచ్ దేశస్తులు 8 మంది, అర్జెంటినాకు చెందిన ఇద్దరు పైలెట్లు మరణించారు. మంగళవారం అర్జెంటినాలోని నార్త్- వెస్ట్ ప్రాంతంలోని లా రియోజ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

2012, 2014లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో వేగంగా ఈత కొట్టి (స్విమ్మింగ్) ఒక బంగారు పథకంతో పాటు మూడు మెడల్స్ సంపాదించిన కెమెలి ముఫట్ (25), 2008, 2012లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో మెడల్స్ సంపాదించిన అలెక్స్ వాస్టైన్ (28), 1990లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో రన్నింగ్ సిగింల్స్ విభాగంలో కంచు పథకం సంపాదించిన ఫ్లోరెన్స్ ఆర్థూడ్ (57)తో సహ 10 మంది మరణించారు. ఈ ముగ్గురు ఫ్రాన్స్ దేశానికి చెందినవారే.

T F-1 (టీ ఎఫ్ 1) అనే టీవీ చానెల్ నిర్వహకులు వివిధ రంగాలలో రాణించిన క్రీడాకారులతో ప్రత్యేకంగా టీవీ షోలు నిర్వహిస్తున్నారు. టీవీ షో చిత్రీకరించడానికి ఫ్రాన్స్ నుండి ముగ్గురు క్రీడాకారులతో పాటు కొందరు టీవీ చానెల్ టెక్నీషియన్లు అర్జెంటినా చేరుకున్నారు. ఇద్దరు పైలెట్లతో పాటు రెండు హెలికాప్టర్లలో నార్త్- వెస్ట్ ప్రాంతంలోకి వెళ్లారు.

హెలిక్యాప్టర్లలో నుండి కెమెరాలతో షూటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో లా రియోజ ప్రాంతంలో ప్రమాదవశాత్తు రెండు హెలికాఫ్టర్లు ఎదురు ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు హెలికాఫ్లర్లు బూడిదయ్యాయి. అందులో ఉన్న 10 మంది సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న అర్జెంటినా అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లు తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం అని అర్జైంటినా, ఫ్రాన్స్ ప్రభుత్వాలు విచారం వ్యక్తం చేశాయి.

-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications