అమెరికా సీజ్ చేసిన నౌకలో ముగ్గురు భారతీయులు.. నెక్స్ట్ ఏంటి..?
రష్యా జెండాతో నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న మరినెరా అనే చమురు నౌకను అమెరికన్ కోస్టు గార్డు సీజ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 2 నెలలు ఈ నౌకపై గస్తీ నిర్వహించిన అమెరికన్ దళాలు.. ఎట్టకేలకు ఈ నౌకను తమ అధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఈ చమురు నౌకలో 28 మంది సభ్యులు ఉన్నట్లు తాజా కథనం ప్రకారం తెలుస్తోంది. వీరిలో 17 మంది ఉక్రెయిన్ కు చెందినవారు కాగా ఆరుగురు జార్జియన్ కు చెందినవారు, అలాగే ముగ్గురు భారత్ కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు రష్యాకు చెందిన వాళ్లు ఉన్నట్లు తాజా కథనం పేర్కొంది.
నార్త్ అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న మరినెరా అనే చమురు నౌకను అమెరికా కోస్ట్ గార్డుకు చెందిన సైన్యం జనవరి 7న సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక రష్యన్ జెండాను కలిగి ఉంది. వెనిజులాలోని చమురు కంపెనీలకు చెందిన ఈ నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించకుండా అమెరికాలోని ఫెడరల్ కోర్టు నిషేధం విధించింది. దాంతో ఈ చమురు నౌకపై దాదాపు 2 నెలల పాటు అమెరికా సైన్యం నిఘా పెట్టింది.
దాంతో తొలుత బెల్లా -1 అనే పేరుతో ఉన్న ఈ నౌక తర్వాత మరినెరా అనే పేరుగా మార్చుకుంది. అయితే ఈ చమురు నౌకలో వివిధ దేశాలకు చెందిన సిబ్బంది ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మల్టీ నేషనల్ క్రూలో భారతీయులు, రష్యన్ దేశస్థులు, ఉక్రెయిన్లు ఉన్నట్లు సమాచారం.
రష్యన్ టుడే అనే మీడియా కథనం ప్రకారం.. ఈ నౌకలో 28 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 17 మంది ఉక్రెయిన్ కు చెందినవారు, మిగతావారిలో ఆరుగురు జార్జియా, ముగ్గురు భారత్, ఇద్దరు రష్యా దేశాలను చెందినవారుగా గుర్తించారు. అయితే ఈ నిషేధిత నౌకను USCGC మున్రో టీమ్ ట్రాకింగ్ చేసి సీజ్ చేసింది. ఫెడరల్ కోర్టు జారీ చేసిన వారెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది అమెరికన్ కోస్టు గార్డు.

అయితే మరినెరా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంపై రష్యా స్పందించింది. చమురు నౌకను సీజ్ చేయడానికి అమెరికాకు ఎలాంటి చట్టపరమైన అవకాశం లేదని స్పష్టం చేసింది. అమెరికా అంతర్జాతియ చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడితే సైనిక చర్య చేపట్టేందుకు కూడా తాము వెనుకాడబోమని రష్యా తేల్చి చెప్పింది. ఇదే విషయంపై రష్యన్ ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ స్పందిస్తూ.. ఈ నౌక రష్యన్ జెండాతో ప్రయాణించడానికి కేవలం తాత్కాలిక పర్మిషన్ మాత్రమే లభించినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications