అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ముగ్గురు ఇండియన్ల విజయడంకా

కాలిఫోర్నియా : అమెరికా అద్యక్ష ఎన్నికల్లో అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు విజయడంకా మోగించారు. విదేశాల్లో కీలకమైన పదవుల్లో భారతీయులు కైవసం చేసుకొంటున్న వార్తలను చూస్తూనే ఉన్నాం. హోరాహోరిగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల,కృష్ణమూర్తి అనే ఇద్దరు విజయడంకా మోగించారు.మరోకరు స్వల్ప ఓట్ల శాతంతో ఓటమిని పొందారు.

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ఎన్నికల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు కొన్ని చోట్ల పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ఓటముల్లో వారు ఎటువైపు మొగ్గితే వారు విజయం సాధించే సందర్భాలు ఉన్నట్టు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇద్దరు ఇండియన్ సంతతికి చెందిన వారు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

కమల 51 ఏళ్ళ భారతీయ అమెరికన్ మహిళ కమల తల్లి 1960 లో చెన్నై నుండి అమెరికా వలస వచ్చారు. అప్పటి నుండి ఆ కుటుంబం ఇక్కడే స్థిరపడింది . కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారీస్ చరిత్ర సృష్టించారు. తొలి ఇండియన్ అమెరికన్ సెనేటర్ గా ఎన్నికై రికార్డు సృష్టించారు.ఈమె డెముక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.ఆమె తసమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి లోరెట్టా శాన్ చెజ్ పై విజయం సాధించారు.అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ మద్దతుతో ఆమె బరిలోకి దిగారు.

three indians win in american elections

మరో వైపు మరో ఇండియన్ కూడ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. ఇలినాయి నుండి డెముక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు.ఈయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటింటివ్స్ కు ఎన్నికయ్యారు. కృష్ణమూర్తికి ప్రవాస తెలుగు సంఘాలు మద్దతు పలికాయి.

భారత సంతతికి చెందిన ప్రమీప జయపాల్ కూడ అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. వాషింగ్టన్ నుండి ఆమె డెముక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సెనేటర్ గా విజయం సాధించారు . యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటిటివ్స్ కు ఎన్నికైన జయపాల్ , జిమ్ మెక్ డెర్మాట్ స్థానంలో భాద్యతలు స్వీకరించారు. జిఎస్ యూఎస్ హౌస్ లో 37 ఏళ్ళు పనిచేసిన అనంతరం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ఆమె ఆ స్థానంలోకి వెళ్తున్నారు.చెన్నైలో జన్మించిన జయపాల్ కుటుంబం అమెరికాలో స్థిరపడింది.తమ ప్రాంతంలో వలసదారుల కోసం చేసిన సేవకు గాను ఆమెను 2012 లో చాంపియన్ ఆప్ చేంజ్ అనే అవార్డు ఇచ్చి వైట్ హౌస్ సత్కరించింది.

అయితే ప్రతినిధుల సభకు పోటీచేసిన మరో ఇండియన్ పరాజయం పాలయ్యాడు. ఇండియన్ అమెరికన్ పీటర్ జాకర్ పరాజయం పాలయ్యాడు. న్యూెర్సీ నుండి డెముక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఓటమి చెందారు. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ లియోనార్డ్ లాన్స్ చేతిలో కేవలం 15 శాతం ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+