Israel-Hamas: ఇజ్రాయెల్ సైన్యం తప్పుతో ముగ్గురు బంధీల మృతి..

ఇజ్రాయెల్ సైనికులు తప్పుతో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు మరణించారు. మరణానించిన వారికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలిపారు. అయితే, పాలస్తీనా గ్రూపు హమాస్‌ను నాశనం చేసేంత వరకు గాజాలో ఇజ్రాయెల్ తన దాడిని కొనసాగిస్తుందని ఆయన చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. "ఇది (హత్యలు) నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇది దేశం హృదయాలను బద్దలు కొట్టింది" అని నెతన్యాహు అన్నారు. "మేము మా ఉనికి కోసం పోరాడుతున్నాము. మేము విజయం వరకు కొనసాగాలి" అన్నారు.

మృతి చెందిన వారిలో యోతమ్ హైమ్, సమర్ తలాల్కా, అలోన్ షమ్రిజ్ ఉన్నారు. వీరంతా 20 ఏళ్లలోపు వారే. ముగ్గురు తెల్ల జెండాను ఎగురవేస్తున్నారని, కాల్పులు జరిగినప్పుడు చొక్కా లేకుండా ఉన్నారని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ ఘటన షిజాయాలో చోటుచేసుకుందన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోకి హమాస్ చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ హమాస్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. గాజాపై విరుచుకు పడింది. ఈ దాడిలో 17,000 మందిని మరణించారు.

Three Israeli hostages died due to the mistake of the Israeli army

నవంబర్‌లో కతార్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత కాల్పుల విరమణ సమయంలో పాలస్తీనా ఖైదీల కోసం హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ గూఢచారిని ఇరాన్‌ ఉరి తీసింది. శనివారం ఈ విషయాన్ని ప్రభుత్వ వార్తా సంస్థ టెహ్రాన్‌లో ప్రకటించింది. ఆ గూఢచారికి మొస్సాద్‌తోపాటు పలు అంతర్జాతీయ నిఘా సంస్థలతో సంబంధాలున్నాయని వెల్లడించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్సులోని జాహెదన్‌ జైలులో అతడిని ఉరి తీసినట్లు పేర్కొంది.

2022 ఏప్రిల్‌లో ముగ్గురు మొస్సాద్‌ గూఢచారులను ఇరాన్‌ అరెస్టు చేసింది. అందులో ఒకరిని తాజాగా ఉరి తీసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢచారి సంస్థ అధిపతి డేవిడ్ బర్నియా శుక్రవారం అర్థరాత్రి యూరప్‌లో ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీని కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.ఇజ్రాయెల్‌ ప్రధాన నగరమైన టెల్‌ అవీవ్‌లో శుక్రవారం రాత్రి వందల మంది ఆందోళనకారులు ఆకస్మికంగా జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. బందీలను విడిపించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+