Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్‌ స్టార్ హోటల్‌లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యం

గ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్‌లోని ఓ స్టార్‌హోటల్‌లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్‌లో ఉన్న ఈ ఫైవ్ స్టార్ హోటల్‌లోకి చొరబడటంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. కొన్ని గంటల పాటు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ బలగాలు తెలిపాయి. స్థానిక కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ ఉగ్రమూకలు పెరల్ కాంటినెంటల్ హోటల్‌లోకి చొరబడ్డారు.

భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగకముందు హోటల్ గదుల్లో ఉన్న అతిథులను, ఎక్కువగా చైనా దేశస్తులను ఖాళీ చేయించినట్లు బలోచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జహూర్ బలేది చెప్పారు. ఈ ఎదురుకాల్పుల్లో పాక్ ఆర్మీ మరియు నేవీ జవాన్లు పాల్గొని కొన్ని గంటల పాటు కాల్పులు జరిపినట్లు ఆయన చెప్పారు. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ఆపరేషన్ ముగిసినట్లు జహూర్ బలేది తెలిపారు. ఈ ఉగ్రవాదులు నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినవారని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Three terrorists killed in Pak hotel after hours of gun battle

ఇదిలా ఉంటే అత్యంత భద్రత కలిగిన పరెల్ కాంటినెంటల్ హోటల్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తుండగా వారిని ఆ హోటల్ సెక్యూరిటీ గార్డు అడ్డుకునే ప్రయత్నం చేశాడని అయితే అతన్ని అక్కడే ఈ ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు పాక్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది.అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం కానీ హోటల్‌లో ఉన్నవారికి గాయాలు అయినట్లు కానీ జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం గ్వదార్‌లో 14 మందిని కొందరు ఉగ్రవాదులు చంపారు. ఇందులో 11 మంది ఆదేశ జవాన్లు ఉండటం విశేషం. ఆ ఘటన మరువక ముందే మళ్లీ గ్వదార్‌లో ఉగ్రవాద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+