Viral Video: ఇదేం పిచ్చి.. పులితో టిక్ టాక్ వీడియో.. 19 ఏళ్ల యువకుడు మృతి
ఇటీవలి కాలంలో రీల్స్ పిచ్చి విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ పాపులర్ అవ్వాలని ఆరాటపడుతున్నారు. ఇలా రీల్స్ మోజులో పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ లోని లాహోర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 19 ఏళ్ల యువకుడు ఏకంగా పులితో టిక్ టాక్ వీడియో తీశాడు. అయితే క్రూరమృగం దాడిలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ రీల్ కోసం మొదలైన ప్రయత్నం.. చివరకు ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా పిచ్చి ప్రస్తుతం యువతపై ఎంతలా ఉందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో సబ్ స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ కోసం ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయడం లేదు. ఏకంగా ప్రాణాలనే పనంగా పెట్టి మరీ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరకు తమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా పాకిస్థాన్ లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోమన్ హసన్ అనే 19 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ పులితో సరదాగా టిక్ టాక్ వీడియో చిత్రీకరించేందుకు ఫామ్ హౌజ్ కు వచ్చాడు. ఈ ఫన్నీ టిక్ టాక్ వీడియో కోసం అక్కడ పెంచుతున్న ఆడపులిని దాని బోను నుంచి బయటకు తీసుకొచ్చారు.
A 19-year-old farm worker was killed after a tigress attacked him during a social media video shoot at a private farm in Kahna, a town in Lahore, Pakistan, according to the Manchester Evening News.The big cat was reportedly taken out of its cage at the request of content creator Nouman Hassan, who wanted to film a TikTok video. The animal attacked the staffer, identified as Talha, who was rushed to hospital but succumbed to his injuries.Police have arrested farm owner Fayyaz and Hassan. The tigress was being kept at a breeding site on the farm. Police said Hassan initially claimed Talha had been attacked by a dog, but the investigation revealed the real cause of death.“A passion for TikTok cannot be more important than a human life,” Lahore Police said, adding that attempts to conceal facts and every aspect of negligence will be investigated. Authorities are now examining whether the farm had permission to keep the tigress and whether safety protocols were followed.Hassan is known for posting risky videos with big cats. In one clip on his Instagram, he is seen trying to kiss a chained tiger, while in another, a leopard he was petting suddenly leapt on him and scratched him.
— The Siasat Daily (@TheSiasatDaily) November 14, 2026
అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న 19 ఏళ్ల తల్హాపై పులి విరుచుకుపడింది. దాంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో తల్హాకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వెంటనే స్పందించిన టిక్ టాకర్ నోమన్ హసన్ తల్హాను కారులో ఎక్కించుకుని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన తల్హా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications
