డేంజరెస్ గేమ్ : పులికి ముచ్చెమటలు పట్టించిన బాతు
ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్ లైఫ్ పార్కులో ఓ బాతు పులితో ఆ ఆట ఆడుకుంది. జూలోని ఎన్‌క్లోజర్‌లో ఈ సంఘటన జరిగింది.
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్ లైఫ్ పార్కులో ఓ బాతు పులితో ఆ ఆట ఆడుకుంది. జూలోని ఎన్‌క్లోజర్‌లో ఈ సంఘటన జరిగింది. బాతు.. పులితో కాసేపు డేంజరస్ గేమ్ ఆడింది. బాతును పట్టుకునేందుకు పులి నీటిలో దిగింది.
బాతు నీటి పైన తేలినప్పుడల్లా దానిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఎగిరి దాని పైన పడే ప్రయత్నం చేసింది. అయితే, ఆ బాతు మాత్రం పులి దగ్గరకు రాగానే నీట మునిగి ఓ ఆట ఆడేసుకుంది. పులికి ముచ్చెమటలు పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

సింబియో వైల్డ్ లైఫ్ పార్క్.. హెలెన్స్‌బర్గ్‌లో ఉంది. ఇది సిడ్నీ దక్షిణ ప్రాంతానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాగా, ఆ బాతు దైర్యసాహసాలను జూ పార్క్ తన ఫేస్‌బుక్ అకౌంట్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications