వీడియో వైరల్ : పులికి మూర్ఛ వ్యాధి... సర్కస్‌లో కలవరం
రష్యా: సర్కస్‌లో ప్రదర్శన ఇస్తూ ఓ పులి మూర్ఛపోయిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వీడియో కాస్త వైరల్ అవడంతో జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికొస్తే...ఆరేళ్ల వయసున్న జెనా అనే పులి రష్యాలోని ఓ సర్కస్‌లో ఉత్సాహంగా ఫీట్లు చేస్తోంది. ప్రేక్షకులు పులి చేసే ఫీట్లక ఫిదా అయిపోయారు. చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా గ్యాలరీ సైలెంట్ అయిపోయింది.
అన్ని పులులూ రింగ్ మాస్టర్ చెప్పిన ఆదేశాలను పాటిస్తూ వాటికి అప్పగించిన ఫీట్లను చేస్తున్నాయి. ఇక నిప్పు అంటించిన రింగ్ నుంచి పులులు దూకాల్సి ఉంది. అయితే ఈ ఫీట్ ఇతర పులులు చాలా ఈజీగానే చేశాయి కానీ జెనా అనే ఈ పులి మాత్రం కాస్త ఇబ్బంది పడింది. ఒక్కసారిగా నిలిచిపోయింది. ఏమైందో తెలుసుకునేందుకు రింగ్ మాస్టర్ ప్రయత్నించాడు. కానీ అది మాత్రం నీలుక్కుంటూ పోయింది. తీరా అది మూర్ఛ వ్యాధికి గురైందని గ్రహించాడు రింగ్ మాస్టర్.

మూర్ఛ వ్యాధికి గురైన జెనా అనే ఈ పులికి ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశాడు. దానిపైకి రెండు బకెట్ల నీర పోశాడు. అంతేకాదు పులిని తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశాడు రింగ్ మాస్టర్. పులి శరీర అవయవాల దగ్గర తాకి దానిని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ పులి మాత్రం చికిత్సకు స్పందించలేదు. మరోవైపు ఇతర పులులు జెనాపై దాడిచేసే అవకాశం ఉంది. జెనాను ఓ వైపు కాపాడుకుంటూనే చికిత్స అందిచాడు రింగ్ మాస్టర్.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవాన్ని హింసించారని ధ్వజమెత్తారు. కానీ రింగ్ మాస్టర్ పులిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంను వారు మెచ్చుకున్నారు. అలాంటి సమయంలో అదే ట్రీట్ మెంట్ చేయాలని వారు అన్నారు. జెనాకు మూర్చ వ్యాధి వచ్చినప్పుడు సర్కస్‌లోని మైకులను బంద్ చేయాల్సిందిగా తాను కేక వేసినట్టు రింగ్ మాస్టర్ తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ పులులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. వాటిని అటవీప్రాంతంలో వదిలేయాలి కానీ, సర్కస్‌లలో ఫీట్లు చేయించకూడదని జంతుప్రేమికులు చెబుతున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications