నగ్నంగా ఉండి చూపించేవారు, కెమెరాలో కూడా ఆ పనులు, పాక్ మంత్రితో హరీమ్ షా టిక్‌టాక్, వైరల్

టిక్ టాక్ స్టార్ హరీమ్ షా చేసిన వీడియో పాకిస్థాన్‌లో ప్రకంపనలు రేపుతోంది. అందులో పాకిస్థాన్ క్యాబినెట్ మంత్రి ఉండటంతో తెగ వైరలవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తోంది. దీనిపై హరీమ్ షాకు బెదిరింపులు రావడంతో ఆమె దేశాన్ని వదలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది.

చిక్కుల్లో మంత్రి

పాకిస్థాన్ రైల్వేశాఖ మంత్రి రషీద్ అహ్మద్ చిక్కుల్లో చిక్కుకున్నారు. టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో వీడియో కాల్ మాట్లాడారు. అయితే అందులో అసభ్యంగా మాట్లాడటం, ఆ వీడియో సోషల్ మీడియోలో ట్రోల్ అవడంతో వివాదం చెలరేగింది.

15 సెకన్ల వీడియో

వీడియోలో పాకిస్థాన్ మంత్రి రషీద్ అహ్మద్, హరీమ్ షాతో మాట్లాడుతున్నారు. 15 సెకన్ల నిడివి గల వీడియోలో.. షా మాట్లాడుతూ మీరు నగ్నంగా ఉండి చూపించేవారు, కెమెరాలో కూడా అనుచితమైన పనులు చేసేవారని అన్నారు. పక్కన ఉన్న మరొకరు నవ్విన శబ్ధం కూడా వీడియోలో స్పష్టంగా వినిపించింది. సంభాషణ పూర్తవగానే కాల్ కూడా కట్టయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియోలో కొందరు షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది.

 బెదిరింపులు

బెదిరింపులు

వీడియో ట్రోల్ అవడంతో హరీమ్‌కు బెదిరింపులు కూడా వస్తోన్నాయి. దీంతో ఆమె అజెర్బైజాన్ నుంచి కెనడా బయల్దేరారు. అక్కడ పౌరసత్వం కోసం అడగాలనుకొంటున్నానని చెప్పారు. పాకిస్థాన్ తిరిగి రావాలనే ప్లాన్ చేసుకోలేదని స్పష్టంచేశారు. అంతేకాదు తాను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిమానినని చెప్పారు. తన కుటుంబసభ్యులు కూడా ఇమ్రాన్.. పీటీఐలో కార్యకర్తలుగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. రషీద్ అహ్మద్ తమ కుటుంబసభ్యుడు లాంటి వారని మరో చానెల్‌తో పేర్కొన్నది.

ఇదివరకు కూడా..

ఇదివరకు కూడా..


ఇప్పుడే కాదు ఇదివరకు కూడా హరీమ్ వివాదాస్పద చర్యలకు దిగారు. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో కూర్చొన్న వీడియో కూడా వైరలైంది. సభా అధ్యక్షత వహించే చోట కూర్చొని వీడియోలో ఫోజిచ్చారు. ఆమె కుడి వైపు పాకిస్థాన్ పితమహుడు మహ్మద్ అలీ జిన్నా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+