కస్టమర్ కేర్ కాల్స్: రెండు లక్షల డాలర్లు కట్టండి..!

అగ్రరాజ్యంలో ఏదైనా సాధ్యమే. తనకు కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయద్దని చెప్పినా వినలేదు అమెరికాలోని ఓ టెలికాం సంస్ధ. అనవసరపు కాల్స్ చేసి విసిగించినందుకు గాను ఏకంగా 2లక్షల డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని చెల్లించుకుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అరసెలీ కింగ్‌ అనే మహిళకు న్యూయార్క్‌కు చెందిన టైమ్‌ వార్నర్‌ కేబుల్‌ అనే టెలికాం సంస్థ నుంచి 153 ఆటోమెటెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి.

Time Warner fined $229K for robocalls

దీంతో విసిగిపోయిన కింగ్ టెలికాం సర్వీసుకు ఫోన్ చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో ఏడు నిమిషాల పాటు తనకు ఇంకెప్పుడూ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ కాల్ చేయొద్దంటూ పేర్కొంది. అయినా పట్టించుకోని కంపెనీ ఏడాదిలో కింగ్‌కు 153 సార్లు ఫోన్ చేసింది.

దీంతో కింగ్ మన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టుని ఆశ్రయించింది. విచారణ అనంతరం మన్‌హట్టన్‌ ఫెడరల్‌ జడ్జి అల్విన్ హెలస్ట్రియన్ తీర్పును వెలువరించారు. ఫెడరల్ టెలిఫోన్ వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వినియోగదారుడి మనోభావాలను దెబ్బతీసేలా మీ ఫోన్ కాల్స్ ఉన్నాయని పేర్కొన్నారు.

ఇందుకు గాను 153 కాల్స్‌కు గాను 1500 డాలర్ల చొప్పున కింగ్‌కు ఆ కంపెనీ 2,29,500 డాలర్లు నష్టపరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. సాధారణంగా అమెరికాలో ఎవరైతే కస్టమర్లు ఆలస్యంగా బిల్లులు చెల్లిస్తుంటారో వారికి 'ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్' సిస్టమ్ ద్వారా ఆటోమెటిక్‌గా ఫోన్ కాల్స్ వెళుతుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+