విదేశీ వనితో పెళ్లి: కాపురానికి అడ్డొస్తున్న అధికారులు!
చెన్నై: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వారి కుటుంబసభ్యులు అంగీకరించడంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వారి కాపురానికి మాత్రం అధికారులు అడ్డువస్తున్నారు. అధికారులెందుకు అడ్డువస్తున్నారంటే వీరి కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సురేష్ కుమార్ అనే యువకుడు ఇటలీకి చెందిన సారా అనే యువతిని ప్రేమించాడు. రెండేళ్లు పెద్దదైన సారాను ఈ మధ్యే తమిళనాడులోని వినియకుడి ఆలయంలో సంప్రదాయ పద్దతిలో పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నాడు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. వివాహం తరువాత భార్యను ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాలనుకున్నాడు సురేష్. అయితే దీనికి ఆమెకు లాంగ్ టర్మ్ వీసా కావాలి.దీంతో వీసాకు అప్లై చేయగా, మ్యారేజీ సర్టిఫికేట్ కావాలన్నారు అధికారులు.

దీంతో రిజిస్ట్రారు ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారు అభ్యంతరం చెప్పారు. సారా విదేశీ యువతి కావడం వల్ల ధృవపత్రం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.
త్వరలో సారా వీసా గడువు ముగుస్తుందని, తర్వాత దీర్ఘ కాలం ఉండేందుకు లాంగ్ టర్మ్ వీసా కావాలని, అది కావాలంటే వివాహ ధృవపత్రం కావాలని.. ఈ అధికారుల దోరణి వల్ల అది కుదరడం లేదని సురేష్ వాపోయాడు. దీంతో ఆమెతో కాపురం చేసేందుకు అధికారులు అడ్డుగా మారినట్లయింది.












Click it and Unblock the Notifications