అమెరికా జోడెడ్ల సవారీ: భారత్‌తో కలిసి మరో సిల్క్‌రోడ్‌కు శ్రీకారం

వాషింగ్టన్‌: దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా చేపట్టిన వన్‌‌బెల్ట్‌ వన్‌‌రోడ్ ‌(ఓబీఓఆర్‌)కు గట్టి పోటీనిచ్చేందుకు అమెరికా న్యూ సిల్క్‌ రోడ్ ‌(ఎన్‌ఎస్‌ఆర్‌), ఇండో - పసిఫిక్‌ కారిడార్‌(ఐపీఈసీ) ప్రాజెక్టులను పునరుద్ధరించనున్నది. ఈ రెండు ప్రాజెక్టులను పునరుద్ధరించాలని అమెరికా నిర్ణయించడంతో భారత్ పాత్ర కీలకం కానున్నది. తద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇన్సియేటివ్ (బీఆర్ఐ) పేరిట చేపట్టిన చైనా చేపట్టిన ప్రతిష్ఠాత్మక 'ఓబీఓఆర్' ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయమని అగ్రదేశం భావిస్తున్నది. కాకపోతే పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు.

వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టులతో చైనా.. ప్రపంచంలోని ముఖ్య ప్రాంతాల్లో ఎకనమిక్‌ కారిడార్ల నిర్మాణం తలపెట్టడం అగ్ర రాజ్యానికి అంత రుచించినట్లు లేదు. అందుకే బడ్జెట్‌ ప్రస్తావనలో సిల్క్‌ ప్రాజెక్టుల అంశాన్ని అమెరికా మంగళవారం చర్చించింది. అంతేకాదు త్వరలో వాటి పనులను ప్రారంభించేందుకు వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది.

న్యూసిల్క్ రోడ్డులో ఆఫ్ఘనిస్థాన్‌కూ చోటు

న్యూసిల్క్ రోడ్డులో ఆఫ్ఘనిస్థాన్‌కూ చోటు

అమెరికా నిర్మించే నూతన సిల్క్ రోడ్డులో ఆఫ్ఘనిస్థాన్, దాని పొరుగుదేశాలకు కూడా చోటు కల్పిస్తోంది. మరోవైపు చైనా చేపట్టిన సిల్క్ రోడ్డు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటుంది. చైనా మద్దతుతో ఏర్పాటైన నూతన అభివ్రుద్ధి బ్యాంక్ (ఎన్‌డీబీ) ప్రారంభ కార్యక్రమానికి దూరంగా ఉన్నందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండాలని అమెరికా నిర్ణయించింది.

2011లో హిల్లరీ ప్రతిపాదనలు ఇలా

2011లో హిల్లరీ ప్రతిపాదనలు ఇలా

అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు
కాగా, 2011 జూలైలో భారత్‌లో పర్యటించిన అప్పటి విదేశాంగశాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల కేంద్రంగా ఎన్‌ఎస్‌ఆర్‌, ఐపీఈసీ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచన ఉన్నదని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు. ఇండో - పసిఫిక్ కారిడార్ దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలను కలుపుతుంది. అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదు. రెండు రోజుల క్రితం ఈ రెండు ప్రాజెక్టులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో తొలి బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చారు.

దక్షిణాసియా, ఆగ్నేయాసియా అనుసంధానకర్త

దక్షిణాసియా, ఆగ్నేయాసియా అనుసంధానకర్త

న్యూ సిల్క్‌ రోడ్‌ (ఎన్‌ఎస్‌ఆర్‌) ప్రాజెక్టు ఆప్ఘనిస్తాన్‌ దాని పొరుగు దేశాల గుండా పోతుందని, ఇండో-పసిఫిక్‌ కారిడార్‌ (ఐపీఈసీ) దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలను కలుపుతుందని అమెరికా వెల్లడించింది. ప్రతిపాదిత ప్రాజెక్టులు వెళ్లే మార్గంలోని దేశాలు, ద్వైపాక్షిక మద్దతుదారులు, బహుళార్థక సాథక అభివ్రుద్ధి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో పరస్పర సహకారం కోసం చర్చిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌లో మార్పుకు కృషి చేస్తున్న అమెరికా.. న్యూ సిల్క్‌ రోడ్‌ ద్వారా మరింత మార్పును తెస్తుందని వివరించింది.

అమెరికా ప్రాజెక్టులకు భారత్ మద్దతిచ్చే చాన్స్

అమెరికా ప్రాజెక్టులకు భారత్ మద్దతిచ్చే చాన్స్

అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం మధ్య ఆసియా దేశాల అభివృద్ధికి, సుస్థిరతకు తోడ్పడుతుందని విదేశీ సంబంధాల మండలి ప్రతినిధి జేమ్స్‌ మెక్‌ బ్రైడ్‌ అన్నారు. చైనా చేపట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు వివాదాస్పద ప్రాంతమైన ‘గిల్గిత్‌ బాల్టిస్తాన్‌' నుండి పోతుండటంతో భారత్‌ ఓబీఓఆర్‌ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చైనా ప్రాజెక్టుకు ధీటుగా ప్రారంభించనున్న ఎన్ఎస్‌ఆర్‌, ఐపీఈసీలకు భారత్‌ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంది.

టర్క్ మన్ గ్యాస్ ఫీల్డ్ నుంచి తేలిగ్గా ఇంధన రవాణ

టర్క్ మన్ గ్యాస్ ఫీల్డ్ నుంచి తేలిగ్గా ఇంధన రవాణ

ఈ ప్రాజెక్టుల్లో భారత్‌ కీలక భాగస్వామి కావడం వల్ల టర్క్‌మన్‌ గ్యాస్‌ ఫీల్డ్స్‌ నుంచి భారత్‌తోపాటు ఫాకిస్థాన్ అవసరమైన ఇంధనాలను సులభంగా తెచ్చుకునే వీలు కలుగుతుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు ఆదాయం కూడా లభిస్తుంది. తాజిక్‌ కాటన్‌ భారత్‌కు అందుబాటులోకి వస్తుంది. ముంబై మార్కెట్‌ పెద్ద ఎత్తున విస్తృతమయ్యే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామి భారత్‌ అవుతుందా? లేదా? అన్న సంగతి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+