Tokyo Olympics 2021: ఉత్తుత్తి మంచాలు: సెక్స్‌లో పాల్గొంటే నడుములు విరుగుతాయ్
టోక్యో: ప్రపంచస్థాయిలో క్రీడారంగంలో అత్యున్నత ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్‌కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 23వ తేదీన ఈ బిగ్ ఈవెంట్ గ్రాండ్‌గా ఆరంభం కానుంది. ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సారి ఒలింపిక్స్‌కు జపాన్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. రాజధాని టోక్యో సహా పలుచోట్ల ఒలింపిక్స్ ఈవెంట్స్ ఏర్పాటు కానున్నాయి. భారత్ సహా అన్ని దేశాల అథ్లెట్లు, క్రీడాకారులు టోక్యోకు తరలి వెళ్లారు. వారందరి కోసం జపాన్ ప్రభుత్వం ఓ క్రీడాగ్రామాన్ని నిర్మించింది. ఇద్దరు అథ్లెట్లు కరోనా వైరస్ బారిన పడటంతో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ- దాన్ని యుద్ధ ప్రాతిపదికన నివారించగలిగారు స్థానిక అధికారులు.
సెక్స్‌లో పాల్గొనకుండా..
సాధారణంగా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చే అథ్లెట్లకు సెక్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంది. ఇదివరకు జరిగిన ఒలింపిక్స్ ఈవెంట్ల సందర్భంగా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడా గ్రామంలో అథ్లెట్లు ఎవరూ సెక్స్‌లో పాల్గొనకూడదంటూ జపాన్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వారికి కేటాయించిన గదుల్లో భౌతిక దూరాన్ని తప్పనిసరి చేసింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కార్డ్‌బోర్డ్ మంచాలను అమర్చింది. ఈ మంచాలు సెక్స్‌కు తట్టుకునేలా ఉన్నాయంటూ జిమ్నాస్టియన్ రైస్ క్లెనెగెన్ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
కార్డ్‌బోర్డ్ మంచాలు..
అయినప్పటికీ- అథ్లెట్లు దీనికి కట్టుబడి ఉండరనే ఉద్దేశంతో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ కొత్త ఎత్తుగడ వేసింది. క్రీడాకారులకు కేటాయించే మంచాన్ని అట్టపెట్టెలతో తయారు చేయించింది. ఒకరి కంటే ఎక్కువ మంది కూర్చున్నా..పడుకున్నా అవి విరిగిపోయేలా రూపొందించింది. కార్డ్‌బోర్డ్‌తో తయారు చేయించిన 18 వేల మంచాలు, పరుపులను ఒలింపిక్ విలేజ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 100 శాతం రీసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉన్న కార్డ్‌బోర్డ్‌లను మంచాల తయారీ కోసం వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఎయిర్‌వేవ్ కంపెనీ దీన్ని తయారు చేసింది.

లక్షా 60 వేలకు పైగా
ఒలింపిక్స్ విలేజ్‌లో ప్రతి క్రీడాకారుడికీ కండోమ్‌లను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 4,50,000 కండోమ్‌లను సిద్ధం చేశారు. ఇప్పటిదాకా లక్షా 60 వేల కండోమ్‌లను క్రీడాకారులకు డిస్ట్రబ్యూట్ చేశారు. 2016లో బ్రెజిల్‌లో రియో డీ జనెరియోలో నిర్వహించిన ఒలింపిక్స్ ఈవెంట్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య అధికం. కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున.. క్రీడాకారులెవరూ సెక్స్‌లో పాల్గనకుండా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆనవాయితీని అనుసరిస్తూ వారికి కండోమ్‌లను అందజేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications