హాలీవుడ్‌ను వదలని కరోనా: ప్రముఖ దంపతులకు వైరస్, ఎలా వచ్చిందంటే..
కరోనా వైరస్ రక్కసి ఎవరినీ వదలడం లేదు. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకొన్న వైరస్.. ఖండంతరాలను దాటుతోంది. తాజాగా హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌కు వైరస్ సోకింది. అస్వస్థతతో ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్‌నకు గురైంది.
Recommended Video

టామ్ హంక్స్ దంపతులు ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే వారికి జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు. సాధారణంగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చారు. అయితే వారు చెప్పే లక్షణాలు కరోనా వైరస్ మాదిరిగా ఉండటంతో.. వైద్యులు ఆ పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ తేలడంతో టామ్ హంక్స్ దంపతులు నోరెళ్లబెట్టారు. ఈ విషయాన్ని టామ్ హంక్స్ ట్వీట్ చేశారు. వెంటనే వైద్యులు అప్రమత్తమై వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

అయితే వారికి ఎలా వైరస్ సోకిందనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. వారు ఎవరితో దగ్గరగా ఉన్నారు. ప్రజలతో సమీపం నుంచి మాట్లాడారా అనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. మరోవైపు కరోనా వైరస్ ప్రబలడంతో తన షోను వాయిదా వేసుకున్నానని ప్రముఖ గాయనీ సీలైన్ డియాన్ ప్రకటించారు. ఆమె జలుబుతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఇప్పటికే వైద్య పరీక్షలు చేసుకున్నానని.. అందులో కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఎందుకైనా మంచిది.. ప్రజలతో దగ్గరగా ఉండకుంటే బెటర్ అని షో ని వాయిదా వేసుకున్నానని వివరించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications