సాధారణ ప్రయాణికుడి అసాధారణ కథ.. ఎయిర్‌లైన్‌ను పీల్చి పిప్పి చేశాడు!
Tom Stuker Story: సాధారణంగా ప్రజలు విమాన ప్రయాణాలకు భయపడతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ భయాన్ని జయించి విమానయాన సంస్థనే ఆశ్చర్యపరిచారు. ఆయనే 71 ఏళ్ల టామ్ స్టూకర్. కేవలం ఒక లైఫ్‌టైమ్ ట్రావెల్ పాస్‌తో దాదాపు 2.4 కోట్ల మైళ్ల(దాదాపు 3.8 కోట్ల కిలోమీటర్లు) దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ దూరం భూమి నుంచి చంద్రునిపైకి 50 సార్లు వెళ్లొచ్చినంత దూరం. టామ్ స్టూకర్ ఈ ప్రయాణాలన్నింటినీ ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండానే చేశారు. కార్ డీలర్‌షిప్ కన్సల్టెంట్, సేల్స్ ట్రైనర్‌గా పని చేసిన టామ్, మొదట్లో విమాన ప్రయాణాలకు చాలా భయపడేవారు. అయితే పని కోసం ఆస్ట్రేలియాకు తరచుగా వెళ్లాల్సి రావడంతో, భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత క్రమంగా భయం తగ్గి, విమాన ప్రయాణం అంటేనే ఇష్టపడటం మొదలుపెట్టారు.
ఈ అద్బుతమైన ప్రయాణం ఎలా మొదలైందంటే..
1990లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక నమ్మశక్యం కాని ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 2,90,000 డాలర్లకు(సుమారు రూ.2.4కోట్లు) జీవితాంతం ప్రపంచంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా, అపరిమితంగా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే పాస్‌ను విక్రయించింది. ఇటువంటి ఆఫర్ అప్పటికీ ఎప్పుడూ రాలేదు. ఆ తర్వాత కూడా రాలేదు. ఈ అరుదైన అవకాశాన్ని టామ్ స్టూకర్ అందిపుచ్చుకున్నారు.

టామ్ స్టూకర్ ప్రయాణాల మైలురాళ్లు
2009: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ద్వారా కోటి మైళ్ల ప్రయాణం పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా టామ్ స్టూకర్ రికార్డు సృష్టించారు.
2018: ఈ ప్రయాణం 2 కోట్ల మైళ్లకు చేరింది.
మే 2024: 2.4 కోట్ల మైళ్ల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పారు.
ఇంతవరకు టామ్ స్టూకర్ 12,000 కంటే ఎక్కువ విమాన ప్రయాణాలు చేశారు. 100కు పైగా దేశాలు సందర్శించారు. ఒక్క ఆస్ట్రేలియాకే 300 సార్లకు పైగా వెళ్లొచ్చారు. కొన్ని సంవత్సరాల్లో ఆయన వార్షిక ప్రయాణ దూరం ఒక మిలియన్ మైళ్లను కూడా దాటింది.
ఎయిర్‌లైన్ హీరోగా టామ్ స్టూకర్
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ టామ్ స్టూకర్‌ను కేవలం ఒక ప్రయాణికుడిగా చూడలేదు. ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా భావించింది.
గౌరవం: టామ్ పేరు మీద రెండు విమానాలకు నామకరణం చేసింది.
ప్రత్యేక గుర్తింపు: టామ్ స్టూకర్ ఏదైనా కొత్త మైలురాయిని చేరుకున్న సమయంలో విమానంలోనే పార్టీలు నిర్వహించేవారు.
ప్రాధాన్యత:ఫస్ట్-క్లాస్‌లో ఆయనకు ఇష్టమైన సీటు 1B ను ఎల్లప్పుడూ ఆయన కోసం రిజర్వ్ చేసేవారు. సరదాగా ఆయన ఆ సీటును తన రెండో ఇల్లుగా చెబుతుంటారు.
వ్యక్తిగత జీవితం: ఈ ప్రయాణాల్లోనే హవాయ్‌లో తన భార్యను కలుసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమెతో కలిసి 120కి పైగా హనీమూన్ ట్రిప్స్‌కు వెళ్లారు.
హాలీవుడ్ ప్రేరణ: 2009లో వచ్చిన హాలీవుడ్ చిత్రం "అప్ ఇన్ ది ఎయిర్" టామ్ స్టూకర్ కథ ఆధారంగానే తెరకెక్కింది. ఇందులో హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ టామ్ పాత్రను పోషించారు.టామ్ స్టూకర్ కథ.. అసాధారణమైన ఆఫర్‌ను అందిపుచ్చుకున్న ఒక సామాన్య వ్యక్తి ఎలా చరిత్ర సృష్టించాడో తెలియజేస్తుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications