పెళ్లి కూతురు మెడలో టమాట దండ... బంగారానికి బదులుగా ఇలా...

సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన టమాట ధర ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే.. టమాట ప్రభావం భారత దేశంతో పాటు పాకిస్తాన్‌ ప్రజల జీవన విధానంలో కూడ ప్రభావం చూపుతుంది. దీంతో అది బంగారం కంటే విలువగా మారిందనే సంకేతాలను అక్కడి ప్రజలు పంపారు. ఇందుకోసం ఓ పెళ్లి కూతురే వేదికగా మారింది. మెడలో టమాట దండ వేసుకుని వినూత్న నిరసన చేపట్టింది ఓ పెళ్లి కూతురు. బంగారానికి బదులు టమాట దండతో దర్శనిమిచ్చింది. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లి కూతురంటే ఆమె మెడలో చెప్పలేనంత బంగారు మెడచుట్టు మోయలేనంత బంగారాన్ని వేసుకుని మొత్తం చూపులన్ని ఆమె వైపే అన్నట్టు సగటు పెళ్లిల్లు జరుగుతున్న విషయం తెలిసిందే... అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఓ పెళ్లి కూతురు దేశ అర్ధిక పరిస్థిని అద్దంపట్టించే విధంగా వ్యవహరించింది. ఇటివల పాకస్తాన్‌లో టమాట ధరలు మూడు వందల రూపాయకు పైగా ఎగబాకింది. ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లి కూతురు టమాట దండలను తన మెడలో వేసుకుంది. చెవులకు టమాటలతో చేసిన పోగులనే చుట్టుకుంది. టమాట ధరలు పెరగడం వల్లే ఇలాంటీ వేషాధరణకు సిద్దమయ్యాయని పెళ్లి కూతురు వివరించింది.

Tomatos on the neck of the bridegroom

అయితే ఆమెను ఇంటర్యూ చేసిన ఓ పాత్రికేయురాలు వీడియో తీసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటీ సంధర్భానుసారంగా ప్రజలు స్పందిస్తుండడంతో ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి పాకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+