బాయ్‌ఫ్రెండ్‌తో షికారు: బ్లెయిర్ డాటర్‌కి గన్‌తో బెదిరింపు

కేథరీన్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మేరీలెబోన్ వీధుల్లో నడుస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరి చేతిలో తుపాకీ ఉంది. ఆ ఇద్దరు వీరి దగ్గరున్న డబ్బులు, ఆభరణాలు ఇవ్వాలని బెదిరించారు.
ఈ ఘటనతో కేథరీన్, బాయ్ ఫ్రెండ్ నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత దొంగలు ఒట్టి చేతులతోనే పారిపోయారు. ఈ ఘటనలో కేథరీన్‌తో పాటు బాయ్ ఫ్రెండ్ క్షేమంగా బయటపడ్డారు.
ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జరిగినట్లుగా స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు తెలిపింది. కాగా, మాజీ ప్రధాని కూతురు ఎలాంటి భద్రత లేకుండా ఎలా షికారు చేస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారట. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications