మీ తదుపరి విదేశీ పర్యటన కోసం: ఐదు అత్యుత్తమ విమాన సర్వీసుల సంస్ధలివే (ఫోటోలు)
మన దేశంలో మే, జూన్ నెలలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే సమ్మర్ సెలవులు ఉంటాయి. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ సెలవులను ఎంజాయ్ చేయాలనుకుంటారు. సమ్మర్ సెలవులను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలనుకునే వారు మనలో చాలా మందే ఉంటారు. మీరు చేయాలనుకునే పర్యటన దేశీయ యాత్ర లేదా విదేశీ పర్యటన కావొచ్చు.
దేశీయ యాత్ర లేదా విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు సరైన ప్రణాళిక అవసరం. ప్లాన్ లేని ప్రయాణం ఎంతో కష్టం. సరైన ప్రణాళికే మీ టూర్‌ను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ప్రపంచంలో అత్యత్తుమ విమాన సర్వీసులు అందించే విమాన సంస్ధల గురించి పెద్దగా తెలియదు.
ఏదో ఒక విమాన సర్వీసులే తక్కువ ధరకే టికెట్ దొరుకుంది ప్రయాణం చేద్దాలే! అనుకుంటారు. కానీ విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకున్నప్పుడు భద్రతా, సౌకర్యాల పరంగా కూడా ఓ ఆలోచన చేయడం ఎంతో ఉత్తమం. కనుక, విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకున్న వారి కోసం విమాన సర్వీసులను అందిస్తున్నాం.
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ అనే సంస్ధ నిర్వహించే సర్వేలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు భద్రతా ప్రమాణాలు కలిగి అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సర్వీసులను అందిస్తున్నట్లు ఐదు అత్యుత్తమ విమాన సర్వీసుల సంస్ధలివే. ఈ ఐదు సంస్ధలు కూడా ఎయిర్‌లైన్స్ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్‌ను సొంతం చేసుకున్నవి కావడం విశేషం.

కథే ఫసిఫిక్ ఎయిర్‌వేస్
ప్రపంచంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కథే ఫసిఫిక్ ఎయిర్‌వేస్ తన సర్వీసులను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 190 గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. భద్రతా, సౌకర్యాల విషయంలో ఎయిర్‌లైన్ రేటింగ్స్ సంస్ధ ఇచ్చిన రేటింగ్స్‌లో సెవెన్ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. వీటితోపాటు విమానంలో అందించే ఆతిథ్య సత్కారాలు, ఎంటర్టైన్మెంట్ అదనం. దీంతో పాటు ప్రపంచంలోని వివిధ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీలు సైతం కథే ఫసిఫిక్ ఎయిర్‌వేస్‌ను అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా పేర్కొన్నారు.

ఎమిరేట్స్
గత రెండు దశాభ్దాలుగా విమానయాన రంగంలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు ఎమిరేట్స్. విమానయాన రంగంలో ప్రయాణికులకు అత్యంత అధ్బుతమైన సౌకర్యరాలను పరిచయం చేసిన ఈ ఎయిర్‌లైన్స్ భద్రత విషయంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఎమిరేట్స్ విమానాలు సురక్షితమైనవి, ప్రమాద రహిత విమానయాన సంస్ధగా పేరుగాంచాయి. ఇక విమానంలో సౌకర్యాలు విషయానికి వస్తే హైక్లాస్ సౌకర్యాలను అందిస్తున్నారు. మీ తదుపరి విదేశీ పర్యటనకు ఎమిరేట్స్ కావాలని ఆశిస్తున్నాం.

ఎతిహాద్ ఎయిర్‌వేస్
ఇటీవల కాలంలో ప్రయాణికుల మనసు చూరుగొన్న విమాన సర్వీసుల్లో ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఒకటి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎతిహాద్ తన సర్వీసులను నిర్వహిస్తోంది. ఎయిర్‌లైన్ రేటింగ్స్ సంస్ధ ఇచ్చిన రేటింగ్స్‌లో 7/7 స్టార్ రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది. ఎతిహాద్ విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్ చేసే అతిథి సత్కారాలు మనం మరువలేం. వెల్‌కం స్టాఫ్‌తో పాటు విమానంలో ఉండే నాన్నిస్ మీ చిన్నారుల సంరక్షణ గురించి అనేక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రంగంలో అనతికాలంలో ఎక్కువ పేరు సంపాందించుకున్న సంస్ధల్లో ఎతిహాద్ ఎయిర్ వేస్ ఒకటి.

లుఫ్తాన్సా
ప్రయాణికులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎయిర్‌లైన్స్ ఏదానా ఉందంటే అంది లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మాత్రమే. భద్రతా పరంగా ఈ ఎయిర్‌లైన్స్ సెవెన్ స్టార్స్‌ను అందుకోగా, విమానంలో అందించే సౌకర్యాలపై సిక్స్ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో లుఫ్తాన్సా ఒకటి. దీనిని మీరు తప్పక అనుభవించాలి. ఇక మీరు భోజన ప్రియులైతే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ అందించే అద్భుతమైన రుచి కలిగిన భోజనం మీరు తప్పక తినాలి. మొట్టమొదటి సారి విమానయానం చేయాలనుకునే వారికి లుఫ్తాన్సా బాగు నచ్చుతుంది.

సింగపూర్ ఎయిర్‌లైన్స్
చివరే కానీ ఆఖరిది కాదు అన్న సామెత ప్రకారం ప్రపంచంలో సుదూర ప్రాంతాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్న ఎయిర్ లైన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒకటి. భద్రతా పరంగా, అద్భుతమైన సౌకర్యాలు కలిగిన ఎయిర్ లైన్స్‌గా సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేరుగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రయాణం చేసే ఎయిర్ లైన్స్‌లో సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒకటి. మీ తదుపరి విదేశీ పర్యటనకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక చక్కని ఎంపిక కావాలని ఆశిస్తున్నాం.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications