Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actress: టాప్ హీరోయిన్ అరెస్టు, నిన్న పొలిటీషియన్ మీద రేప్ కేసు పెట్టింది, డ్రగ్స్ కేసుతో, రివర్స్ ?

ఢాకా/బాంగ్లాదేశ్: ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సీనియర్ పోలీసు అధికారి చెడ్డీ దోస్త్ మీద అత్యాచారయత్నం కేసు పెట్టిన టాప్ హీరోయిన్ చిక్కుల్లో పడింది. రేప్ కేసులో అరెస్టు అయిన ఆ రాజకీయ నాయకుడు ప్రతీకారం తీర్చుకున్నాడో ?, ఏమో ? తెలీదు కాని డ్రగ్స్ కేసులో టాప్ హీరోయిన్ మాత్రం అరెస్టు అయ్యింది. తనను చంపేస్తారని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రికి ఆ టాప్ హీరోయిన్ ఫేస్ బుక్ లైవ్ లో మొరపెట్టుకునింది. టాప్ హీరోయిన్ కు రక్షణ కల్పించాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్న సమయంలోనే హీరోయిన్ ఇంటిలోకి పోలీసు అధికారులు, ర్యాపిడ్ యాక్షన్ కమాండర్లు, డ్రగ్స్ నిరోదక దళం కమాండర్లు ఎంట్రీ ఇచ్చారు. నాలుగు గంటల పాటు ఆ హీరోయిన్ ఇంట్లో సోదాలు చేసిన అధికారుటు డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ సీజ్ చేసి ఆమెను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

 బంగ్లాదేశ్ లో టాప్ హీరోయిన్

బంగ్లాదేశ్ లో టాప్ హీరోయిన్

బంగ్లాదేశ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న పోరీ మోనీ అలియాస్ మోనీ (28) అనే యువతి డ్రగ్స్ ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ యాంటీ టెర్రర్ స్కాడ్ (RAB) అధికారులు ఆమెను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా బనానీలో ఉన్న పోరీ మోనీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్, ఆయన సిబ్బంది ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు చేసిన తరువాత పోరీ మోనీని రాత్రికి రాత్రే అరెస్టు చేశారు.

 డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ సీజ్

డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ సీజ్


ప్రముఖ నటి పోరీ మోనీ ఇంట్లో నిషేధిత డ్రగ్స్, మత్తు మాత్రలు, నిషేధిత విదేశీ మద్యం చిక్కిందని, అందుకే ఆమెను అరెస్టు చేశామని రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ స్పష్టం చేశారు. పోరీ మోనీ డ్రగ్స్ సేవిస్తోందని తమకు పక్కా సమాచారం అందడం వలనే ఆమె ఇంటిలో సోదాలు చేసిన తరువాత అరెస్టు చేశామని రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ స్థానిక మీడియాకు చెప్పారు.

పొలిటికల్ లీడర్ మీద రేప్ కేసు పెట్టిన హీరోయిన్

పొలిటికల్ లీడర్ మీద రేప్ కేసు పెట్టిన హీరోయిన్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సీనియర్ పోలీసు అధికారి స్నేహితుడైన నజీర్ ఉద్దీన్ అహమ్మద్ మీద జూన్ 8వ తేదీన బోట్ క్లబ్ లో తన మీద అత్యాచారయత్నం చేశాడని పోరీ మోనీ కేసు పెట్టింది. టాప్ హీరోయిన్ అయిన పోరీ మోనీ అత్యాచారయత్నం కేసు పెట్టడం బంగ్లాదేశ్ ను కుదిపేసింది.

 ప్రధాని పేరు లాగిన హీరోయిన్

ప్రధాని పేరు లాగిన హీరోయిన్

వ్యాపారవేత్త నజీర్ ఉద్దీన్ అహమ్మద్ కు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారులు సన్నిహితంగా ఉంటున్నారని, అందుకే నేను కేసు పెట్టినా ఆయన్ను అరెస్టు చెయ్యాలేదని నటి పోరీ మోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి పోరీ మోనీకి బంగ్లాదేశ్ ప్రజలతో పాటు ఆమె అభిమానుల మద్దతు ఇచ్చారు. తనకు న్యాయం చెయ్యాలని నటి పోరీ మోనీ మీడియా ముందు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మనవి చేసింది.

 రాజకీయ నాయకుడు అరెస్టు

రాజకీయ నాయకుడు అరెస్టు

బంగ్లాదేశ్ వ్యాప్తంగా నటి పోరీ మోనీకి ఊహించని మద్దతు చిక్కడంతో పోలీసు అధికారి నిందితుడు నజీర్ తోపాటు ముగ్గురు మహిళలు, డ్రగ్స్ విక్రమిస్తున్న డీలర్ తహీన్ ను అరెస్టు చేశారు. నజీర్ తో పాటు అందరూ బెయిల్ మీద బయటకు వచ్చేశారు. తరువాత హీరోయిన్ పోరీ మోనీ కథ రసవత్తరంగా మారింది.

ప్రతీకారమా ?, నిజంగానేనా

ప్రతీకారమా ?, నిజంగానేనా

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త నజీర్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తనను వాళ్లు చంపేస్తారని నటి పోరీ మోనీ ఆరోపించింది. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రి షేక్ హసీనాకు టాప్ హీరోయిన్ పోరీ మోనీ ఫేస్ బుక్ లైవ్ లో మొరపెట్టుకునింది. పోలీసుల మీద తనకు నమ్మకం లేదని పోరీ మోనీ ఆరోపించింది. టాప్ హీరోయిన్ పోరీ మోనీకి రక్షణ కల్పించాలని ఆమె అభిమానులు డిమాండ్ చేశారు.

గంటల్లోనే అరెస్టు

గంటల్లోనే అరెస్టు


ఫేస్ బుక్ లైవ్ లో పోరీ మోనీ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఆమె ఇంటికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆమెను అరెస్టు చేశారు. ఇప్పుడు టాప్ హీరోయిన్ పోనీ మోరీ చిక్కుల్లో పడింది. రేప్ కేసులో అరెస్టు అయిన రాజకీయ నాయకుడు నజీర్ ప్రతీకారం తీర్చుకున్నాడో ?, ఏమో ? తెలీదు కాని డ్రగ్స్ కేసులో టాప్ హీరోయిన్ పోరీ మోనీ మాత్రం అరెస్టు అయ్యింది. హీరోయిన్ పోరీ మోనీని కోర్టు ముందు హాజరు పరిచామని, ఆమెను రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారని పోలీసు అధికారులు అంటున్నారు.

దేశాన్ని కుదిపేసింది

దేశాన్ని కుదిపేసింది

టాప్ హీరోయిన్ పోరీ మోనీ అరెస్టు కావడంతో బంగ్లాదేశ్ సినీ పరిశ్రమను, రాజకీయ రంగాన్ని కుదిపేసింది. హీరోయిన్ పోరీ మోనీ ఎక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించింది ? ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. పోరీ మోనీ డ్రగ్స్ సేవించి మా క్లబ్ మీద దాడి చేసిందని గుల్షన్ అల్ కమ్యూనిటీ క్లబ్ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్ కేసు పెట్టడంతో హీరోయిన్ పోరీ మోనీ కష్టాల్లో పడింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే పోరీ మోనీ కేసు పెట్టడంతో జైలుకు వెళ్లిన నజీర్ అదే క్లబ్ డైరెక్టర్ గా ఉన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+